మీకు కప్పు గెలవాలని లేదా.. కంటెస్టెంట్స్ ను మందలించిన బిగ్ బాస్, కీర్తీ- శ్రీహాన్ మధ్య మళ్లీ గొడవలు

By Mahesh JujjuriFirst Published Dec 1, 2022, 11:50 PM IST
Highlights

బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 రసవత్తరంగా తయారయ్యింది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో టిక్కెట్ టు  ఫినాలే  టాస్క్ హోరా హోరీగా సాగుతోంది. ఒకరిని మించి మరొకరు ఆ ట్రోఫీ సాధించడానికి కష్టపడుతున్నారు. 
 

బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 రసవత్తరంగా తయారయ్యింది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో టిక్కెట్ టు  ఫినాలే  టాస్క్ హోరా హోరీగా సాగుతోంది. ఒకరిని మించి మరొకరు ఆ ట్రోఫీ సాధించడానికి కష్టపడుతున్నారు. ఇప్పటికే ఈ టాస్క్ నుంచి శ్రీసత్య, ఇనయా, ఎలిమినేట్ అవ్వగా.. తాజాగా  కీర్తీ కూడా కొన్ని అనుకోని పరిస్థితుల్లో ఈ రేస్ నుంచి ఎలిమినేట్ అయ్యింది. ఇక ఈ మధ్యలో హౌస్ లో వాడీ వేడీ వాతావరణం కనిపించింది. ముఖ్యంగా  ఇంట్లో అందరూ కలిసిపోయి ఉన్నారు.. శత్రువులు మిత్రులయ్యారు అనుకున్న టైమ్ కు.. మళ్ళీ గొడవలు స్టార్ట్అయ్యాయి. 

ముఖ్యంగా టాస్క్ విషయంలో... సంచాలక్ గా ఉన్న ఇనయా, శ్రీసత్యలు శ్రీహాన్ కు ఫేవర్ గా ఉన్నారని, శ్రీహాన్ ను విన్నర్ గా ప్రకటించి తనకు అన్యాయంచేశారంటూ కీర్తి ఫైర్ అయ్యింది. అంతే కాదు తను గేమ్ నుంచి ఎలిమినేట్ అవ్వడంతో.. ఆ బాధను తట్టుకోలేక ఏడ్చేసింది కీర్తి. ఒక్క సారి తనతో మాట్లాడమంటూ బిగ్ బాస్ కు రిక్వెస్ట్ చేసింది. అంతే కాదు అసలు విషయం మాట్లాడటానికి వచ్చిన శ్రీసత్యతో మాట్లాడటానికి ఇష్టపడలేదు కీర్తి. ఆరువాత కాస్త నార్మల్ అయ్యింది. 

ఇక ఇక ఆతరువాత టాస్క్ లో రేవంత్, ఆదిరెడ్డి, రోహిత్ పాల్గోనగా.. ఫజిల్ లాంటి గజిబిజి రారులు దాటుకుంటూ.. కోడి గుడ్లను అవతలి టార్గెట్ కు చేర్చాలి. ఈ టాస్క్ లో ఆదిరెడ్డి విన్ అయ్యాడు. రేవంత్ అస్సలు సరిగ్గా చేయలేకపోయాడు. రోహిత్ మాత్రం సిన్సియర్ గా ట్రై చేశాడు. ఇక 12 పాయింట్లతో ఆదిరెడ్డి టికెట్ టూ ఫినాలే రేస్ లో ముందుండగా.. 10 పాయింట్లతో శ్రీహాన్ సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు.

ఇక తమకు బిగ్ బాస్ ట్రోఫీ ఎంత ఇపార్టెంట్ లో ఎవరికి వారు ఆడియన్స్ కు వివరించమంటూ బిగ్ బాస్ చెప్పగా.. ప్రతీ ఒక్కరూ తమకు ట్రోఫీ ఎంత ఇంపార్టెంటో వివరంచారు. ఈక్రమంలో శ్రీహాన్ మందుగా తనకు విన్ అవ్వడం ఎంత ఇంపార్టెంటో వివరించగా.. మిగతావారు తమపని తాము చేసుకుంటున్నాు. ఈక్రమంలో.. బిగ్ బాస్ అందరికి ఓచిన్న వార్నింగ్ ఇచ్చారు. మీకు ట్రోఫీ ఇంపార్టెంట్ కాదా.. మీరు చెప్పుకోరా అని గద్దించడంతో.. ప్రతీ ఒక్కరు తమకు ఎంత ఇంపార్టెంట్ లో వివరించారు. 


తన తల్లికి తాను కప్పు గెలిచి రావాలని.. కోరిక అంటూ శ్రీహాన్ ఎమోషనల్ అవ్వగా..  బిగ్ బాస్ విన్నర్ గా తనను అవమానించిన వాళ్ళ ముందు గర్వంగా నిలబడాలి అనకుంటున్నట్టు ఇనయా చెప్పుకొచ్చింది. ఆడపిల్లగా బయటకు రాకూడదు అని రూల్స్ పెట్టిన దగ్గర నుంచి.. ఇక్కడి వరకూ వచ్చాను.. తాను కప్పు గెలిచి తన తల్లికోసం ఇల్లు కట్టాలి అంటోంది ఫైమ.ఎవర్ ఏమనుకున్నా ఫైట్ చేశాను.. ఎప్పుడూ టాస్క్ ల నుంచి తప్పించుకోలేదు.. అంటూ రేవంత్.. గేమ్ బాగా ఆడాను ఆశీర్వదించండిఅంటూ రోహిత్.  కుటుంబం అంతా పోయిన తనకు బయట ప్రపంచంలోచెప్పుకునే విజయ్ బిగ్ బాస్ అవ్వాలంటూ కీర్తి .. కెమెరా ముందు వాపోయింది. ఇక ఆదిరెడ్డి తన స్టైల్ లో తాను విన్నర్ ను అవ్వాలి అనుకుంటున్నట్టు చెప్పుకొచ్చాడు. 

click me!