చిరంజీవిలోని కొత్త కోణం బయటపెట్టిన మార్నింగ్ మందారం..!

Published : Oct 31, 2020, 11:09 AM ISTUpdated : Oct 31, 2020, 11:28 AM IST
చిరంజీవిలోని కొత్త కోణం బయటపెట్టిన మార్నింగ్ మందారం..!

సారాంశం

చిరంజీవి తనలోని కొత్త కోణాన్ని బయటపెట్టారు. తనలో కెమెరామెన్ తో పాటు అద్భుతమైన కవి ఉన్నాడని తెలియజేశారు. చిరంజీవి పంచుకున్న మందారం పూల ఫోటోలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఆయన స్కిల్స్ కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.   

కోవిడ్ కారణంగా ఆచార్య షూటింగ్ కి బ్రేక్ రాగా చిరంజీవి తన కలల సౌధంలో గడుపుతున్నారు. వందల కోట్లతో గ్రాండ్ గా నిర్మించిన హౌస్ లో చిరంజీవి బ్రేక్ టైం ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఫోటోగ్రాఫర్ అండ్ రైటర్ గా కూడా మారిపోయాడు. తాను తీసిన అందమైన మందారం ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకోవడతో పాటు అద్భుత వివరణ ఇచ్చారు. చిరంజీవి తన ఇంటి బాల్కనీలో పెంచిన మందారం మొక్కకు పూసిన పూలను ఫోటోలు తీసి ఇంస్టాగ్రామ్ అకౌంట్ పోస్ట్ చేశారు. 

'ప్రభాత సౌందర్యాన్ని వొడిసి పట్టుకుని, మా  ఇంటి మందారం తన  కొప్పుని సింగారించింది .. అలవోకగా నా కెమెరా కంటికి చిక్కి అంతర్జాలానికి తన అందం తెలిసింది!' అని చిరంజీవి తాను తీసిన ఫోటోల గురించి పొయెటిక్ గా చెప్పడం జరిగింది. చిరులో ఉన్న కెమెరా స్కిల్స్, కవి హృదయాన్ని మందారం పూలు బయట పెట్టాయి. ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచి ఈ అందమైన దృశ్యాన్ని చిరంజీవి తన కెమెరాలో బంధించారు. 

ఇక త్వరలో చిరంజీవి ఆచార్య షూటింగ్ లో పాల్గొననున్నారు. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం దాదాపు 40 శాతం వరకు షూటింగ్ జరుపుకుంది. ఈ మూవీలో కాజల్ హీరోయిన్ గా నటిస్తుండగా రామ్ చరణ్ ఓ కీలక రోల్ చేయనున్నారు. అలాగే మెహర్ రమేష్, సుజీత్ లతో మరో రెండు సినిమాలు చిరంజీవి లైన్ లో పెట్టారు. యంగ్ హీరోలకు మించిన వేగంతో చిరంజీవి వరుసగా సినిమాలు చేయడం విశేషం. కోవిడ్ లేని పక్షంలో ఆచార్య విడుదలకు సిద్ధంగా ఉండేది. 
 

PREV
click me!

Recommended Stories

Thanuja: కళ్యాణ్ పాడు చేసుకుంటున్నాడు, తనూజలో సడెన్ గా ఈ మార్పు దేనికోసం.. సూటిగా ప్రశ్నించిన అభిమాని
Top 6 Romantic Movies: 2025లో టాప్ 6 రొమాంటిక్ మూవీస్, ఆ ఒక్క సినిమాకి ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్