Bhumika: 21 ఏళ్ల తర్వాత 'ఖుషి' సాంగ్ కి భూమిక డ్యాన్స్.. వైరల్ వీడియో

Sreeharsha Gopagani   | Asianet News
Published : Feb 17, 2022, 06:12 PM IST
Bhumika: 21 ఏళ్ల తర్వాత 'ఖుషి' సాంగ్ కి భూమిక డ్యాన్స్.. వైరల్ వీడియో

సారాంశం

పవన్, మహేష్, ఎన్టీఆర్ లకు భూమిక లక్కీ హీరోయిన్. వీరి ముగ్గురితో భూమిక నటించిన చిత్రాలు ఘనవిజయం సాధించాయి. యువకుడు చిత్రంతో 2000లో హీరోయిన్ గా పరిచయం అయింది.

పవన్, మహేష్, ఎన్టీఆర్ లకు భూమిక లక్కీ హీరోయిన్. వీరి ముగ్గురితో భూమిక నటించిన చిత్రాలు ఘనవిజయం సాధించాయి. యువకుడు చిత్రంతో 2000లో హీరోయిన్ గా పరిచయం అయింది. ఇక ఆల్ టైం క్లాసిక్ ఖుషి చిత్రంతో భూమిక పేరు మారుమోగిపోయింది. ఆ తర్వాత వచ్చిన ఒక్కడు, సింహాద్రి చిత్రాలు భూమికని తిరుగులేని హీరోయిన్ గా నిలబెట్టాయి.

ఖుషి మూవీ యూత్ లో ట్రెండ్ సెట్ చేసిన చిత్రం. ఆ మూవీలో పవన్ కళ్యాణ్, భూమిక మధ్య కెమిస్ట్రీ అత్యంత అద్భుతంగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ బిగ్గెస్ట్ హిట్స్ లో ఖుషి ఒకటి. పవన్, భూమిక జోడి ఈ చిత్రంలో ఒక ఎత్తైతే.. మణిశర్మ అందించిన సంగీతం మరో ఎత్తు. ఈ చిత్రంలోని 'అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా అనే సాంగ్ యువతని ఒక ఊపు ఊపింది. 

దాదాపు 21 ఏళ్ల తర్వాత భూమిక ఈ సాంగ్ కి డ్యాన్స్ చేయడం విశేషం. అదే మ్యాజిక్ రిపీట్ చేస్తూ ఫుల్ జోష్ తో భూమిక డాన్స్ చేసింది. తన స్నేహితురాలు సవితతో కలసి ఈ సాంగ్ కి డాన్స్ చేసిన వీడియోని భూమిక సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. నేను నా స్నేహితురాలు సవిత కలసి ఖుషి సాంగ్ ని రీ క్రియేట్ చేస్తున్నాం అని కామెంట్ పెట్టింది. 

దీనితో ఈ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. నెటిజన్లు, పవన్ ఫ్యాన్స్ ఖుషి చిత్ర మెమొరీస్ ని రీకాల్ చేసుకుంటున్నారు. భూమికపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 43 ఏళ్ల వయసులో కూడా భూమిక చెరగని గ్లామర్, ఎనర్జీతో ఉందని అంటున్నారు. 

సెకండ్ ఇన్నింగ్స్ లో భూమిక అక్క, వదిన తరహా పాత్రలు అందుకుంటోంది. భూమిక చివరగా తెలుగులో పాగల్, సీటిమార్ లాంటి చిత్రాల్లో నటించింది.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Akhanda 2 Collections: అఖండ 2 మూవీ 10 రోజుల కలెక్షన్లు.. నెగటివ్‌ టాక్‌తోనూ క్రేజీ వసూళ్లు.. ఎంత నష్టమంటే
Bharani: మూడో సీజన్ నుంచి అడుక్కుంటున్నారు, నాగబాబు వల్ల బిగ్ బాస్ ఆఫర్ రాలేదు..మొత్తం రివీల్ చేసిన భరణి