జీవితాంతం తోడుంటానని ఆ అమ్మాయికి మాటిచ్చా.. మంచు మనోజ్ మాటలకి కన్నీరు పెట్టుకున్న మౌనిక

By Asianet NewsFirst Published Mar 21, 2023, 12:59 PM IST
Highlights

హీరో మంచు మనోజ్, భూమా మౌనిక ఇటీవల వివాహం చేసుకుని ఒక్కటయ్యారు. వీరిద్దరికి ఇది రెండవ వివాహమే. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించారు.

హీరో మంచు మనోజ్, భూమా మౌనిక ఇటీవల వివాహం చేసుకుని ఒక్కటయ్యారు. వీరిద్దరికి ఇది రెండవ వివాహమే. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించారు. మంచు ఫ్యామిలీ నుంచి మనోజ్.. పొలిటికల్ బ్యాగ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి భూమా మౌనిక రావడంతో వీరిద్దరి ప్రేమ పెళ్లిపై అందరిలో ఆసక్తి పెరిగింది. 

ఇటీవల కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువుల సమక్షంలో మంచు లక్ష్మి నివాసంలో వీరిద్దరి వివాహం జరిగింది. ప్రస్తుతం మంచు మనోజ్, మౌనిక జంట ఎక్కడికి వెళ్లినా అభిమానుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ కొత్త జంటకి అంతా శుభాకాంక్షలు చెబుతున్నారు. 

అయితే మార్చి 19న మోహన్ బాబు 71వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. తిరుపతిలోని మోహన్ బాబుకి చెందిన శ్రీవిద్యానికేతన్ సంస్థల్లో మోహన్ బాబు జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంచు మనోజ్ ఎమోషనల్ గా ప్రసంగించారు. మంచు మనోజ్, భూమా మౌనిక జంటగా మోహన్ బాబు బర్త్ డే వేడుకలకు హాజరు కావడం విశేషం. 

మనోజ్ విద్యార్థుల గురించి ప్రసంగిస్తూ చివర్లో తన తండ్రి, భార్య గురించి మాట్లాడి ఎమోషనల్ అయ్యాడు. నేను ప్రేమించిన అమ్మాయి స్వేచ్ఛగా ఉండాలి. తన డ్రీమ్స్ ని వెతుక్కోవాలి. తాను ఏం చేయాలన్నా నేను సపోర్ట్ ఇవ్వాలి. ప్రతి మగాడి గెలుపు వెనుకాల ఆడవారు ఉంటారు. ఆడవారి విజయం వెనుక కూడా మగాళ్లు ఉండాలి అని మంచు మనోజ్ తెలిపారు. మనోజ్ ఇలా మాట్లాడుతుంటే అతడి భార్య మౌనిక సంతోషంతో కంటతడి పెట్టుకున్నారు. 

మా నాన్న గారు నాకు అన్ కండీషనల్ లవ్ ఇచ్చారు. నేను కొన్ని వందలసార్లు ఆయన్ని ఇబ్బంది పెట్టాను. కానీ ఎప్పుడూ ఆయన ప్రేమ మాత్రం తగ్గలేదు. నాన్న నేను ఒక అమ్మాయికి మాటిచ్చాను జీవితాంతం తోడుగా ఉంటానని అని చెబితే నీ నిర్ణయాన్ని గౌరవిస్తున్నా అని అన్నారు. మీ అందరికి తెలుసు మౌనికకి తల్లిదండ్రులు లేరు. కానీ మా నాన్న మౌనిక నా మూడో కూతురు అని అన్నారు. ఎన్ని జన్మలెత్తినా మా నాన్న రుణం తీర్చుకోలేను అని మంచు మనోజ్ ఎమోషనల్ గా మాట్లాడారు. 

click me!