
పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘భీమ్లా నాయక్’ (Bheemla Nayak) చిత్రం చివరి దశ షూటింగ్ మళ్లీ ప్రారంభమైంది. సినిమాకు సంబంధించిన లాస్ట్ సాంగ్ - ‘భీమ్ భీమ్ బీమ్లా నాయక్’ షూటింగ్ పనులు ప్రస్తుతం హైదరాబాద్‌లోనే కొనసాగుతున్నాయి. ఈ షెడ్యూల్ పూర్తైయితే షూటింగ్ ముగింపు దశకు చేరుకోనుంది. తర్వలోనే ఈ మూవీ రిలీజ్ డేట్ పైనా అప్డేట్ ఇవ్వనున్నట్టు మేకర్స్ తెలిపారు. కానీ ఫిబ్రవరి 25నే విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
ఈ సినిమా విడుదలపై సోమవారం క్లారిటీ రానుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూను ఎత్తివేసి, వందశాతం ఆక్యుపెన్సీని కూడా అనుమతిస్తే, ఫిబ్రవరి 25న ‘భీమ్లా నాయక్’ థియేటర్లలోకి రానుంది. దక్షిణ భారతదేశంలోని ఏ ఇతర రాష్ట్రంలోనూ థియేటర్‌లలో ఆక్యుపెన్సీపై పరిమితులు లేవు. ఆంధ్రప్రదేశ్ లో COVID-19 ఆంక్షలు ఫిబ్రవరి 14న (రేపటితో) ముగుస్తాయి. దీంతో థియేటర్లపైనా ఆంక్షల ప్రభావం పడింది. ఏదేమైనా పవన్ కళ్యాణ్ 'భీమ్లా నాయక్' అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్‌లలో ఒకటి. ఫిబ్రవరి 25న విడుదలైతే మాత్రం ఓపెనింగ్స్ బీభత్సం సృష్టించనున్నాయి.
`భీమ్లా నాయక్` చిత్రంలో పవన్, రానా హీరోలుగా నటిస్తుండగా, నిత్యా మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా యాక్ట్ చేస్తున్నారు. నివేదా థామస్ కీలక పాత్రలో కనిపించబోతుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన `అయ్యప్పనుమ్ కోషియుమ్` చిత్రానికిది రీమేక్. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తుండగా, త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.
కరోనా పరిస్థితులను బట్టి.. మేకర్స్ ఇచ్చిన లాస్ట్ అప్డేట్ ప్రకారం `భీమ్లా నాయక్` చిత్రం రిలీజ్ డేట్ ను ఫిబ్రవరి 25న లేదంటే ఏప్రిల్ 1న ప్రకటించారు. కానీ తాజాగా సీని ప్రముఖులు ఏపీ సీం జగన్ మోహన్ రెడ్డిని కలిసి థియేటర్స్ ఆక్యుపెన్సీ, టికెట్ల ధరలు, బెనిఫిట్ షోలపై చర్చించారు. ఈ సందర్భంగా రేపు ఏపీ ప్రభుత్వం నుంచి జీవో వెలువడనుంది. జీవో ఆధారంగా ‘భీమ్లా నాయక్’ నిర్మాణ సంస్థ రిలీజ్ డేట్ ను ఫైనల్ చేయనుంది.