Bheemla Nayak:భీమ్లా నాయక్ హిందీలో విడుదల...పవన్ కి పరువు సమస్య!

Published : Feb 11, 2022, 02:53 PM IST
Bheemla Nayak:భీమ్లా నాయక్ హిందీలో విడుదల...పవన్ కి పరువు సమస్య!

సారాంశం

భీమ్లా నాయక్ (Bheemla Nayak)బాలీవుడ్ లో విజయం సాధిస్తే పవన్ ఇమేజ్ మరో లెవెల్ కి చేరుతుంది. ఒకవేళ పరాజయం పొందితే... పవన్ తో పాటు ఆయన ఫ్యాన్స్ నొచ్చుకోవాల్సి వస్తుంది. 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawam Kalyan)లేటెస్ట్ మూవీ భీమ్లా నాయక్ విడుదలపై సందిగ్ధత కొనసాగుతుంది. ఫిబ్రవరి 25 లేదా ఏప్రిల్ 1న భీమ్లా నాయక్ విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. టికెట్స్ ధరలు పెంపు, 100 శాతం ఆక్యుపెన్సీకి ఏపీ ప్రభుత్వం అనుమతిచ్చిన నేపథ్యంలో భీమ్లా నాయక్ ఫిబ్రవరి 25న విడుదలవుతుంది. కాగా భీమ్లా నాయక్ హిందీలో కూడా విడుదల చేస్తున్నట్లు సమాచారం. భీమ్లా నాయక్ చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ విషయాన్ని తెలియజేశారు. దీంతో పవన్ భీమ్లా నాయక్ ఏమేరకు బాలీవుడ్ లో విజయం సాధిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. 

ఒక విధంగా పవన్ కళ్యాణ్ కి ఇది సవాల్.  భీమ్లా నాయక్ (Bheemla Nayak)బాలీవుడ్ లో విజయం సాధిస్తే ఆయన ఇమేజ్ మరో లెవెల్ కి చేరుతుంది. ఒకవేళ పరాజయం పొందితే... పవన్ తో పాటు ఆయన ఫ్యాన్స్ నొచ్చుకోవాల్సి వస్తుంది. పుష్ప (Pushpa)మూవీతో అల్లు అర్జున్ ప్రభంజనం సృష్టించాడు. ఏకంగా వంద కోట్ల వసూళ్లతో బాక్సాఫీస్ షేక్ చేశాడు. 2021 హైయెస్ట్ గ్రాసర్స్ లో పుష్ప ఒకటిగా నిలిచింది. మెగా హీరో అయిన అల్లు అర్జున్ తన మొదటి ప్రయత్నంతోనే భారీ సక్సెస్ కొట్టాడు. 

మేనల్లుడు బన్నీ (Allu Arjun)ఆ స్థాయిలో సక్సెస్ కాగా.. పవన్ కళ్యాణ్ కి ఇది ప్రెస్టేజ్ మేటర్. అందులోను అల్లు అర్జున్, పవన్ ఫ్యాన్స్ కి కొన్నాళ్ల క్రితం గొడవలు జరిగాయి. ఓ మూవీ వేడుకలో పవన్ పేరు చెప్పనన్న బన్నీ, ఫ్యాన్స్ పై ఫైర్ అయ్యారు. వేరే హీరోల సినిమా ఫంక్షన్స్ లో మీ గోల ఏంటి అంటూ క్లాస్ ఫీకాడు. అప్పట్లో బన్నీ స్పీచ్ సంచలనం క్రియేట్ చేసింది. దీనికి నిరసనగా పవన్ ఫ్యాన్స్ బన్నీపై రివేంజ్ తీర్చుకున్నారు. బన్నీ సినిమా ట్రైలర్ కి డిజ్ లైక్స్ కొట్టడం, మూవీపై నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేయడం చేశారు. 

ఈ వివాదంలో బన్నీనే కాంప్రమైజ్ అయ్యారు. తర్వాత బన్నీ పవన్ ఫ్యాన్స్ కోరినట్లు పవన్ పేరు ప్రస్తావించారు. అప్పటి నుండి మెగా ఫ్యాన్స్ లోని అల్లు అర్జున్, పవన్ ఫ్యాన్స్ మధ్య చిన్న గ్యాప్ అయితే కొనసాగుతుంది. హిందీలో పుష్ప సక్సెస్ నేపథ్యంలో బన్నీ ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు. కాబట్టి భీమ్లా నాయక్ తో నార్త్ బెల్ట్ లో ఖచ్చితంగా విజయం సాధించాల్సిన బాధ్యత పవన్ పై ఉంది. భీమ్లా నాయక్ కనీస ఆదరణ దక్కించుకోకపోతే అవమాన భారం తప్పదు. 

ఇక వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ భీమ్లా నాయక్ చిత్రాన్ని హిందీలో విడుదల చేయాలని పవన్ కి సూచించిన విషయం తెలిసిందే. పవన్ కంటే వెనకొచ్చిన స్టార్స్  పాన్ ఇండియా హీరోలు అవుతుంటే ఇంకా తెలుగును పట్టుకొని వేలాడవద్దని అసహనం వ్యక్తం చేశారు. భీమ్లా నాయక్ హిందీలో విజయం సాధిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేసిన వర్మ... పవన్ ని ఉద్దేశిస్తూ సెటైర్స్ వేస్తూనే భీమ్లా నాయక్ పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలన్నారు. భీమ్లా నాయక్ నిర్మాత నాగ వంశీ ప్రకటనతో వర్మ సూచనను తూచా తప్పకుండా పాటిస్తున్నట్లు అయ్యింది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

చిరంజీవి, అనిల్ రావిపూడి రెమ్యునరేషన్స్ కే బడ్జెట్ మొత్తం అయిపోయిందా ? ఇక సినిమా పరిస్థితి ఏంటి ?
Illu Illalu Pillalu Today Episode Dec 17: వల్లిని గట్టిగా నిలదీసిన రామరాజు, దొంగ సర్టిఫికెట్లతో భాగ్యం