‘భీమ్లా నాయక్‌’ డైరక్టర్ నెక్ట్స్ ఖరారు, హీరో ఎవరంటే...

By Surya PrakashFirst Published Jan 25, 2023, 5:58 AM IST
Highlights

 భీమ్లా నాయక్ హిట్ అయినా కూడా సాగర్ చంద్రకి అంతగా పేరు రాలేదు, ఆ తర్వాత కొన్ని అవకాశాలు వచ్చినా అవి ఏమీ మెటిరియలైజ్ కాలేదు. 


క్రితం సంవత్సరం పవన్ కళ్యాణ్ తో భీమ్లానాయక్ చిత్రం రూపొందించిన సాగర్ చంద్ర ..ఆ తర్వాత ప్రాజెక్టు ఏమిటనేది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న అంశం. విభిన్నమైన కథతో అప్పట్లో ఒకడుండేవాడు సినిమాతో ప్రేక్షకులని మెప్పించిన సాగర్ చంద్ర చాలా సంవత్సరాలు గ్యాప్ తీసుకున్న తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని డైరెక్ట్ చేసే అవకాశం వచ్చింది భీమ్లా నాయక్ సినిమాతో. భీమ్లా నాయక్ సినిమాకి సాగర్ చంద్ర దర్శకుడు అయినా మొత్తం వెనకుండి నడిపించింది త్రివిక్రమ్ అని ప్రచారం జరిగింది. దీంతో సాగర్ చంద్రకి రావాల్సిన  క్రెడిట్ లో చాలా భాగం త్రివిక్రమ్ కి వెళ్ళిపోయింది.

దాంతో భీమ్లా నాయక్ హిట్ అయినా కూడా సాగర్ చంద్రకి అంతగా పేరు రాలేదు, ఆ తర్వాత కొన్ని అవకాశాలు వచ్చినా అవి ఏమీ మెటిరియలైజ్ కాలేదు. ఇంత ట్యాలెంట్ ఉన్న దర్శకుడికి అవకాశాలు ఎందుకు రావట్లేదు అని అందరూ అనుకుంటున్నారు. అయితే ఎట్టకేలకు సాగర్ చంద్రకి ఓ సినిమా వచ్చినట్టు తెలుస్తుంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్... ఓ యాక్షన్ సబ్జెక్టు ఓకే చేసి సాగర్ చంద్రకి అవకాశం ఇచ్చాడని సమాచారం. పీరియడ్ కథతో సాగే ఈ చిత్రం ఓ డిఫరెంట్ ఎప్రోచ్ తో ఉండబోతోందని చెప్తున్నారు. 14 రీల్స్ ప్లస్  వారు ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా రూపొందించనున్నారు.  త్వరలోనే వీరిద్దరి కాంబినేషన్లో సినిమాని అనౌన్స్ చేయనున్నారు.

సాగర్ చంద్ర మాట్లాడుతూ..‘‘అయ్యారే’కి డైరెక్షన్‌ చేస్తున్నప్పుడు సినిమా తీయాలనే తపన తప్ప నాకు ఇంకేం తెలీదు. ‘అప్పట్లో ఒకడుండేవాడు’కి  పరిచయాలు పెరిగాయి, కొంత అవగాహన వచ్చింది. ఆ సినిమా ఒక అడుగు ముందుకెళ్లేలా చేసింది. ‘భీమ్లా నాయక్‌’ నన్ను మరో మెట్టు ఎక్కించింది. ఈ మూడు సినిమాలు నాకు మంచే చేశాయి’’ అని సాగర్‌ కె. చంద్ర అన్నారు.  ఈ సినిమా వల్ల వచ్చిన పేరు, గుర్తింపుతో హ్యాపీ. ‘భీమ్లానాయక్‌’ని త్వరలో హిందీలోనూ రిలీజ్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నా తర్వాతి సినిమా రీమేక్‌ కాకుండా స్ట్రైట్‌ మూవీ చేస్తా.‘భీమ్లానాయక్‌’ కి ముందు వరుణ్‌ తేజ్‌తో 14రీల్స్‌ ప్లస్‌ బ్యానర్‌లో ఓ సినిమా ప్రకటించారు. బడ్జెట్‌ అనుకున్నదానికంటే ఎక్కువ అవడంతో ఆగింది.. ఆ కథతోనే సినిమా చేస్తానా? కొత్త కథతోనా? చూడాలి’’ అన్నారు. ఇప్పుడు అదే ప్రాజెక్టు ఫైనల్ అయ్యిందని తెలుస్తోంది.
 

click me!