ప్రముఖ గేయ రచయిత భాస్కరభట్లకి మాతృవియోగం!

Published : Jul 10, 2019, 10:22 AM IST
ప్రముఖ గేయ రచయిత భాస్కరభట్లకి మాతృవియోగం!

సారాంశం

ప్రముఖ సినీ గేయ రచయిత భాస్కరభట్ల రవికుమార్ తల్లి విజయలక్ష్మి (67) అనారోగ్యంతో మరణించారు.

ప్రముఖ సినీ గేయ రచయిత భాస్కరభట్ల రవికుమార్ తల్లి విజయలక్ష్మి (67) అనారోగ్యంతో మరణించారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవారంలో నివాసముంటున్న ఆమె గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.

దీంతో ఆమెని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో జాయిన్ చేసి చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతూ సోమవారం రాత్రి ఆమె తుదిశ్వాస విడిచారు. ఆమెకి ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భాస్కరభట్ల పెద్ద కుమారుడు.

విజయలక్ష్మి అంత్యక్రియలు స్థానిక ఇన్నీసుపేట కైలాసభూమిలో మంగళవారం నాడు జరిగాయి. ఆమె చితికి భాస్కరభట్ల నిప్పంటించారు. ఆమె మరణవార్త విన్న పలువురు సినీ ప్రముఖులు, సాహితీకారులు భాస్కరభట్లకు తమ సానుభూతి తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Naga Vamsi: సంక్రాంతి సినిమాల పోటీపై నిర్మాత నాగవంశీ హాట్‌ కామెంట్‌.. `అనగనగా ఒక రాజు` ఎందుకు స్పెషల్‌ అంటే
The Raja Saab రిజల్ట్ ని ప్రభాస్‌ని ముందే ఊహించాడా? మారుతితో ఏం చెప్పాడంటే.. ది రాజా సాబ్‌ 2 అప్‌డేట్‌