కల్కి సినిమాపై రజినీకాంత్ సంచలన కామెంట్స్, సినిమా చూసిన విజయ్ దేవరకొండ ఏమన్నారంటే..?

Published : Jun 29, 2024, 04:45 PM IST
కల్కి సినిమాపై రజినీకాంత్ సంచలన కామెంట్స్, సినిమా చూసిన విజయ్ దేవరకొండ ఏమన్నారంటే..?

సారాంశం

ప్రభాస్ పాన్ వరల్డ్ మూవీ కల్కి పై తన అభిప్రాయం వెల్లడించారు తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్. తాజాగా మూవీ చూసిన తలైవా.. కల్కిపై సంచలన రివ్యూ ఇచ్చి ఆశ్చరపరిచారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..? 

పాన్ ఇండియా స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు ప్రభాస్. వరుసగా భారీ బడ్జెట్ సినిమాలు చేస్తున్నారు. ఈక్రమంలో ప్రభాస్ నటించిన  'కల్కి 2898 AD' సినిమా రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఈమూవీ  పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. హ్యాట్రిక్ ఫెయిల్యూర్ తరువాత సలార్ తో హిట్ కొట్టిన ప్రభాస్ కు.. కల్కితో మరింత ఉపశమనం కలిగినట్టు అయ్యింది. అంతే కాదు  ప్రభాస్‌కి కల్కి 2898 AD' విజయం ఎనర్జీ బూస్టర్‌గా మారింది.

మొదటి రోజు ఈ సినిమా 200 కోట్లకు పైగా కలెక్ట్ చేస్తుందని ఫ్యాన్స్ ఎక్స్ పెక్ట్ చేశారు. అంతే కాదు కొన్ని  కమర్షియల్ రిపోర్ట్స్ కూడా ఇలానే వచ్చాయి. అయితే మూవీ టీమ్ మాత్రం ఈమూవీ ఫస్ట్ డే  191.5 కోట్లు కలెక్ట్ చేసిందని అఫిషియల్ గా అనౌన్స్ చేశారు.  'కల్కి' కలెక్షన్స్ పై వైజయంతిమూవీస్ అఫీషియల్ గా సోషల్ మీడియాలో అనౌన్స్ చేసి సర్ ప్రైజ్ ఇచ్చారు. ఇక  ఈ సినిమా కేవలం రెండు రోజుల్లోనే దాదాపు 350 కోట్ల కలెక్షన్స్ ని క్రాస్ చేసిందని అంటున్నారు.

600 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా బిజినెస్, శాటిలైట్, డిజిటల్ రైట్స్‌లో కోట్లాది రూపాయలను రాబట్టింది. ఇక ఈసినిమా  5 రోజుల్లోనే 600 కోట్ల కలెక్షన్లు రాబడుతుంది అని అంచనాలు వేస్తున్నారు. ఈ సినిమా చూసి అభిమానులే కాకుండా పలువురు సెలబ్రిటీలు కూడా తమ అభిమతాలను తెలియజేస్తున్నారు. తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ తో పాటు.. రౌడీ హీరో విజయ్ దేవరకండ కూడా ఈసినిమాపై తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించారు. 

 

సూపర్ స్టార్ రజనీకాంత్ ‘కల్కి 2898 AD’ సినిమా చూసి అభిమానులను ఆశ్చర్యపరిచే విధంగా పోస్ట్ చేశారు. ఆ పోస్ట్‌లో రజనీకాంత్ ఇలా రాశారు, "నేను కల్కిని చూశాను. వావ్, ఎంత చారిత్రాత్మక చిత్రం. దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రంతో భారతీయ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాడు. నా స్నేహితులందరికీ అశ్విన్ దత్, అమితాబ్ బచ్చన్, ప్రభాస్, కమల్. హాసన్. మరియు దీపికా పదుకొణె అందరికి అభినందనలు. ఇక  రెండవ భాగం కోసం ఎదురు చూస్తుంటాను అంటూ రజినీకాంత్ అన్నారు. 

ఇక ఈసినిమా చూసిన విజయ్ దేవరకొండ కూడా కాస్త ఆశ్చర్యంగా స్పందించారు. ఆయన ఏమన్నారంటే..? ఇప్పుడే సినిమా చూశాను.
ఏం చెప్పాలో తెలియడం లేదు.. మనస్సు పొంగిపోయింది భారతీయ సినిమా కొత్త స్థాయిని  అందించింది సినిమా ఇక ఈమూవీ భారీ కలెక్షన్స్ సాధిస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇది 1000 కోట్లు.. అంతకంటే ఎక్కువ వసూలు చేస్తుందని ఆశిస్తున్నాను అని అన్నారు విజయ్. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Samantha: సమంతపై పోటీకి దిగుతున్న మహేష్, మంచు విష్ణు, తేజ సజ్జా.. భయపడాల్సిన అవసరమే లేదా ?
Singer Sunitha: 18 ఏళ్ళ వయసులోనే చూశా, అమ్మాయిలకు ఇండస్ట్రీ సేఫ్ కాదు..సంచలన నిజాలు బయటపెట్టిన సింగర్ సునీత