Bhala Thandanana:‘ఆచార్య’తో రిస్క్ ఎందుకుని తప్పుకుంటున్నారా?

Surya Prakash   | Asianet News
Published : Apr 25, 2022, 10:22 AM IST
Bhala Thandanana:‘ఆచార్య’తో రిస్క్ ఎందుకుని తప్పుకుంటున్నారా?

సారాంశం

వేసవి సెలవులు, మే 3న రంజాన్‌ పండగను దృష్టిలో పెట్టుకొని ఈ నెల 30న మా చిత్రాన్ని రిలీజ్‌ చేయాలని నిర్ణయించాం అని టీమ్ చెప్పారు.  కానీ ఏప్రిల్ 29న ఆచార్య చిత్రం రిలీజ్ అవుతుండటంతో, అంతటి భారీ మూవీతో శ్రీవిష్ణు ఎందుకు పోటీ పడుతున్నాడని పలువురు కామెంట చేస్తున్నారు. 


శ్రీవిష్ణు, కేథరిన్‌ థ్రెసా జంటగా నటించిన చిత్రం ‘భళా తందనాన’. ‘బాణం’ సినిమా ఫేమ్‌ చైతన్య దంతులూరి దర్శకత్వం వహించారు. సాయి కొర్రపాటి సమర్పణలో వారాహి చలన చిత్రం పతాకంపై రజనీ కొర్రపాటి నిర్మించారు.  వేసవి సెలవులు, మే 3న రంజాన్‌ పండగను దృష్టిలో పెట్టుకొని ఈ నెల 30న మా చిత్రాన్ని రిలీజ్‌ చేయాలని నిర్ణయించాం అని టీమ్ చెప్పారు.  కానీ ఏప్రిల్ 29న ఆచార్య చిత్రం రిలీజ్ అవుతుండటంతో, అంతటి భారీ మూవీతో శ్రీవిష్ణు ఎందుకు పోటీ పడుతున్నాడని పలువురు కామెంట చేస్తున్నారు. ఇక ఈ సినిమాలోని కంటెంట్‌పై చిత్ర యూనిట్ పూర్తి ధీమాగా ఉండటంతోనే ఈ సినిమాను ఆచార్యకు పోటీగా రిలీజ్ చేస్తున్నారని చిత్ర వర్గాలు అంటున్నాయి.  

అయితే ఇప్పుడు రిలీజ్ డేట్ మార్చే అవకాసం ఉందంటూ మీడియాలో వార్తలు వినవస్తున్నాయి. అందుకు కారణం ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కాన్సిల్ కావటమే. ఆచార్య రిలీజ్ మరుసటి రోజే రిలీజ్ చేసి ఆ చిత్రంతో పోటీ పడటం ఎందుకుని ఈ నిర్ణయం తీసుకున్నాడంటున్నారు. అయితే మరో రిలీజ్ డేట్ వెంటనే దొరకటం అంటే కష్టమే.
 
‘‘కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రం ‘భళా తందనాన’. మా సినిమా టీజర్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. మణిశర్మ సంగీతం అందించిన మా సినిమాలోని పాటలకు మంచి స్పందన వస్తోంది. పీటర్‌ హెయిన్‌ యాక్షన్‌ స్టంట్స్‌ ప్రేక్షకులను అలరిస్తాయి’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది. రామచంద్రరాజు, శ్రీనివాస్‌ రెడ్డి, సత్య తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: సురేష్‌ రగుతు.  
 

PREV
click me!

Recommended Stories

Emmanuel lover ఎవరో తెలుసా? డాక్టర్ ను పెళ్లాడబోతున్న బిగ్ బాస్ 9 టాప్ కంటెస్టెంట్
Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్