'RX 100' ని మించిపోయేలా ఉందే..!

Published : Sep 01, 2018, 02:48 PM ISTUpdated : Sep 09, 2018, 11:59 AM IST
'RX 100' ని మించిపోయేలా ఉందే..!

సారాంశం

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కంపెనీ నుండి వస్తోన్న మరో సినిమా 'భైరవ గీత'. వర్మ దగ్గర శిష్యరికం చేసిన సిద్ధార్థ్ తథోలు అనే వ్యక్తి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కానున్నాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కంపెనీ నుండి వస్తోన్న మరో సినిమా 'భైరవ గీత'. వర్మ దగ్గర శిష్యరికం చేసిన సిద్ధార్థ్ తథోలు అనే వ్యక్తి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కానున్నాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రాయలసీమలో జరిగిన ఓ యదార్ధ సంఘటన ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. తెలుగు, కన్నడ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.

ట్రైలర్ ను బట్టి సినిమాలో హింస, రక్తపాతం, యాక్షన్ తదితర అంశాలు ఓ రేంజ్ లో ఉన్నాయని తెలుస్తోంది. ఓ పెద్దింటి అమ్మాయిని ప్రేమించి కారణంగా హీరో తమ కుటుంబాన్ని కోల్పోవడం, ఊరు రెండుగా చీలిపోవడం.. పగ తీర్చుకోవడానికి హీరో రాక్షసుడిలా మరి తన కక్షను సాధించి ఎలా ప్రేమను పొందాడనే కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.

పైగా దర్శకుడు ఈ సినిమా ట్రైలర్ లో తన గురువు వర్మ స్టైల్ లో ఘాటైన ముద్దుసీన్లను కూడా చూపించాడు. ఈ మధ్యకాలంలో విడుదలవుతున్న సినిమాల్లో లిప్ లాక్స్ అనేవి కామన్ గా మారిపోయాయి. ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ ను కూడా లిప్ లాక్ తో ఎండ్ చేసి సినిమాపై ఆసక్తిని పెంచేశారు. 

 

PREV
click me!

Recommended Stories

ప్రభాస్‌కి గ్యాప్‌ లేకుండా చేసిన చిరంజీవి.. `మన శంకరవరప్రసాద్‌ గారు` రిలీజ్‌ డేట్‌ ఫిక్స్
Suman Shetty Eliminate: సుమన్‌ శెట్టి ఎలిమినేట్‌.. భరణితో స్నేహం దెబ్బ కొట్టిందా? తనూజ ఆవేదన