`భగవంత్‌ కేసరి` సెకండ్‌ సింగిల్‌ కి టైమ్‌ ఫిక్స్.. కూతురుతో బాలయ్య..

Published : Oct 01, 2023, 01:18 PM IST
`భగవంత్‌ కేసరి` సెకండ్‌ సింగిల్‌ కి టైమ్‌ ఫిక్స్.. కూతురుతో బాలయ్య..

సారాంశం

బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న `భగవంత్‌ కేసరి` చిత్రం  దసరా కి రాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషనల్‌ కార్యక్రమాల జోరు పెంచింది యూనిట్‌.

నందమూరి బాలకృష్ణ(Balakrishna).. వరుస హిట్లతో ఉన్నారు. `అఖండ`, `వీరసింహారెడ్డి` విజయాలు ఆయనలో జోష్‌ని నింపాయి. అదే జోష్‌తో ఇప్పుడు హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టేందుకు రెడీ అవుతున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్‌ చిత్రాలకు కేరాఫ్‌గా నిలిచే అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో `భగవంత్‌ కేసరి` (Bhagavanth Kesari) చిత్రం రూపొందుతుంది. తెలంగాణ బ్యాక్‌ డ్రాప్‌లో ఈ చిత్రం సాగుతుండటం విశేషం. ఇప్పటికే విడుదలైన టీజర్‌ ఆకట్టుకుంది. 

అలాగే గణేష్‌ పై `గణేష్‌ ఆంథెమ్‌` వచ్చే మొదటి సాంగ్‌ కూడా ఆకట్టుకుంది. అయితే దానికి ఆశించిన స్థాయిలో ఆదరణ దక్కలేదు. వినాయకచవితికి మోత మోగిస్తుందని భావించినా అది జరగలేదు. ఈ విషయంలో థమన్‌ డీలా పడిపోయాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు సెకండ్‌ సింగిల్‌ని తీసుకురాబోతున్నారు. సినిమా దసరాకి విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ కార్యక్రమాల ఊపు పెంచారు. అందులో భాగంగా `ఉయ్యాలో ఉయ్యాల` అంటూ సాగే రెండో పాటకి సంబంధించిన అప్‌డేట్‌ వచ్చింది.

అక్టోబర్‌ 4న ఈ పాటని విడుదల చేయనున్నట్టు తాజాగా చిత్ర బృందం వెల్లడించింది. ఈ సందర్భంగా ఓ కొత్త పోస్టర్‌ని విడుదల చేసింది. ఇందులో ఓ నది ఒడ్డున గట్టుపై బాలకృష్ణ, చిన్న పాప కూర్చొని ఉన్నారు. ఇందులో బాలయ్య యంగ్‌ లుక్‌లో కనిపిస్తున్నారు. ఈ పాట ఫ్లాష్‌ బ్యాక్‌లో వస్తుందని తెలుస్తుంది. ఆ పాప, బాలయ్య మధ్య ఉన్న అనుబంధాన్ని తెలియజేసేలా ఈ పాట సాగుతుందని టాక్. అయితే ఆ పాపకి బాలయ్య బాబాయ్‌ అవుతారని తెలుస్తుంది. మొన్న విడుదల చేసిన గణేష్‌ పాటలో `కాక` అనే పదాన్ని పలికిన విషయం తెలిసిందే. 

థమన్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో బాలయ్య సరసన కాజల్‌(Kajal) హీరోయిన్‌గా నటిస్తుంది. శ్రీలీల కీలకపాత్ర పోషిస్తుంది. బాలీవుడ్‌ నటుడు అర్జున్‌ రాంపాల్‌ ఈ చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఆయన నెగటివ్‌ రోల్‌ చేస్తున్నట్టు సమాచారం. షైన్‌ స్క్రీన్‌ పతాకంపై సాహు గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మిస్తున్న చిత్రమిది. విజయదశమి కానుకగా అక్టోబర్‌ 19 ఈ చిత్రం విడుదల కాబోతుంది. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Top 10 Heroines : రష్మిక కు సమంత గండం, సినిమాలు లేకున్నా మొదటి స్థానంలో ఎలా? టాప్ 10 హీరోయిన్ల లిస్ట్ ఇదే?
Malliswari Review: బావ మరదలుగా ఎన్టీఆర్, భానుమతి రొమాన్స్, ఫస్ట్ తెలుగు పాన్ వరల్డ్ మూవీగా మల్లీశ్వరి రికార్డు..