
శనివారం హోస్ట్ నాగార్జున కంటెస్టెంట్స్ ని రఫ్ ఆడించేశాడు. తప్పొప్పులు సరిదిద్దుతూ ఎపిసోడ్ సాగింది. ఈ క్రమంలో కొందరిని హెచ్చరించారు. మరికొందరికి శిక్షలు కూడా పడ్డాయి. అయితే సండే మాత్రం నాగార్జున కూల్ అయిపోతారు. సరదా ఆటలతో ఎపిసోడ్ ని ఎంటర్టైనింగ్ గా నడిపిస్తారు. ఈ సండే కూడా నాగార్జున కంటెస్టెంట్స్ తో గేమ్స్ ఆడించారు.
ఇంటి సభ్యులను రెండు టీమ్స్ గా విభజించిన నాగార్జున 'బొమ్మ గీయి గెస్ చేయి' అనే గేమ్ పెట్టాడు. టీమ్ నుండి ఒక సభ్యుడు వచ్చి బౌల్ లో ఉన్న పేపర్ రోల్ తీయాలి. ఆ పేపర్ మీద రాసి ఉన్న సినిమా టైటిల్ ని బొమ్మగా వేయాలి. తమ టీమ్ సభ్యులు గుర్తించాలి. ఈ గేమ్ సరదాగా నడిచింది. సినిమా టైటిల్స్ ని బొమ్మల్లో చెప్పలేక, వాటిని గెస్ చేయలేక ఇరు టీమ్ సభ్యులు తికమకపడ్డారు.
అలాగే వీకెండ్ అంటే అందమైన డ్రెస్సుల్లో ఇంటి సభ్యులు సిద్ధం అవుతున్నారు. రతికా రోజ్ షార్ట్ ఫ్రాక్ సూపర్ హాట్ గా కనిపించింది. అమ్మడు స్కిన్ షో చూసి నాగ్ సైతం షాక్ అయ్యాడు. ఇక నామినేషన్స్ లో ఆరుగురు ఉన్నారు. ప్రియాంక, గౌతమ్, శుభశ్రీ, ప్రిన్స్ యావర్, రతికార్ రోజ్, టేస్టీ తేజాలలో ఒకరు ఎలిమినేట్ కావాల్సి ఉంది.
ఈ వారం రతికా రోజ్ ఎలిమినేట్ అంటూ సమాచారం అందుతుంది. నామినేటైన వారిలో రతికా రోజ్, తేజాలకు తక్కువ ఓట్లు వచ్చాయక. తేజా కంటే కూడా రతికా రోజ్ ఓటింగ్ లో వెనుకబడిన నేపథ్యంలో ఆమె ఎలిమినేట్ అయ్యిందని అంటున్నారు. నేటి ఎలిమినేషన్ తో కేవలం 10 మంది ఇంటి సభ్యులు మిగులుతారు. ఈ క్రమంలో వైల్డ్ కార్డు ఎంట్రీలో పెద్ద మొత్తంలో ఉంటాయనే ప్రచారం జరుగుతుంది.