నందమూరి బాలయ్య ‘భగవంత్ కేసరి’ నుంచి ఫస్ట్ సింగిల్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్న క్రమంలో.. తాజాగా ప్రొమోను వదిలారు. ‘గణేశ్ ఆంథెమ్’తో ప్రీ గణేశ్ చతుర్థి వేడుకలను తీసుకొచ్చారు.
నందమూరి బాలకృష్ణ (Balakrishna) లేటెస్ట్ ఫిల్మ్ ‘భగవంత్ కేసరి’ (Bhagavanth Kesari) కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గరపాటి, హరీశ్ పెద్ది గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్ గ్లింప్స్, పోస్టర్లకు అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది. ఇక మ్యూజికల్ ట్రీట్ అందించేందుకు చిత్ర యూనిట్ సిద్ధమైంది. ఈ క్రమంలో ఫస్ట్ సింగిల్ ను రెడీ చేస్తున్న విషయం తెలిసిందే.
తాజాగా మొదటి పాట గణేశ్ ఉత్సవాలపై రానుండగా.. తాజాగా ప్రోమో విడుదల చేయడంతో ప్రీ-గణేష్ చతుర్థి వేడుకలు ప్రారంభమయ్యాయి, భగవంత్ కేసరి నిర్మాతలు Ganesh Anthem పేరిట ఫస్ట్ సింగిల్ ప్రోమోను కొద్ది సేపటి కింద ఆవిష్కరించారు. గాడ్ ఆఫ్ మాస్ నందమూరి బాలకృష్ణ. శ్రీలీల ప్రోమోలో దుమ్ములేపారు. ‘బిడ్డ ఆన్తలేదు.. చప్పుడు జర గట్టిగా చేయమను..’ అంటూ బాలయ్య, ’అరేయ్ తీసి పక్కనబెట్టండ్రా మీరు తీన్ మార్.. మా చిచ్చా వచ్చిండు.. ఎట్లుండాలే కొట్టర కొట్టు సౌమారో’ అంటూ శ్రీలీలా చెప్పిన డైలాగ్ తో సాంగ్ పై మరింత ఆసక్తి పెరిగింది. థమన్ ప్రోమోతోనే సాంగ్ పై హైప్ పెంచారు. ఇక ఫుల్ వెర్షన్ సెప్టెంబర్ 1న విడుదల కానుందని తెలిపారు.
undefined
కాగా, దర్శకుడు అనిల్ రావిపూడి ప్రతి సినిమాలోనూ ఓ ప్రత్యేకమైన పాయింట్ ఉంటుంది. ‘భగవంత్ కేసరి’లో బాలకృష్ణ, శ్రీలీల (Sreelea) బాబాయిగా, అమ్మాయిగా కనిపించనుండటం విశేషం. వీరిద్దరి బంధం గణేష్ గీతం సాంగ్ ప్రోమో ద్వారా వెల్లడైంది. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు మాస్, తీన్మార్ నంబర్‌తో దుమ్ములేపబోతున్నారని అర్థం అవుతోంది.
ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తుంది, ఇందులో జాతీయ అవార్డు-విజేత నటుడు అర్జున్ రాంపాల్ నటిస్తున్నారు. ఈ చిత్రంతో ఆయన టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సి రామ్ ప్రసాద్, ఎడిటర్: తమ్మి రాజు, ప్రొడక్షన్ డిజైనర్: రాజీవ్. యాక్షన్ పార్ట్‌కి వి వెంకట్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఈ దసరా కానుకగా అక్టోబర్ 19న చిత్రం థియేటర్లలో పెద్ద ఎత్తున విడుదల కానుంది.
చిచ్చా వచ్చిండు.. ఇగ కొట్టర కొట్టు సౌమారు 🥁🥁 Song Promo out now💥
- https://t.co/dmRUlieCdv
Full Lyrical on Sep 1st🔥
A Musical🥁 pic.twitter.com/EmQb6sE1Pm