టైగర్ నాగేశ్వరరావు విడుదలకు బ్రేక్? కోర్టులో పిటిషన్!

Published : Aug 30, 2023, 05:32 PM IST
టైగర్ నాగేశ్వరరావు విడుదలకు బ్రేక్? కోర్టులో పిటిషన్!

సారాంశం

రవితేజ అభిమానులకు ఇది షాకింగ్ న్యూస్. టైగర్ నాగేశ్వరరావు చిత్ర విడుదల నిలిపివేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.   

ఒకప్పుడు దేశాన్ని వణికించిన స్టూవర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతుంది టైగర్ నాగేశ్వరరావు. రవితేజ టైటిల్ రోల్ చేస్తున్నారు. దర్శకుడు వంశీ తెరకెక్కిస్తున్నారు. టైగర్ నాగేశ్వరరావు చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 20న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ చిత్ర విడుదలకు బ్రేక్ పడే సూచనలు కనిపిస్తున్నాయి. టైగర్ నాగేశ్వరరావు చిత్ర విడుదల నిలిపివేయాలంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. 

పిటిషనర్ తరపు న్యాయవాది పృథ్వి ఈ మేరకు వాదనలు వినిపించారు.  కేసును విచారణకు స్వీకరించిన హైకోర్టు చిత్ర నిర్మాతతో పాటు పిటిషన్ లో పేర్కొన్న ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది . తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది. దీంతో రవితేజ ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు. 

టైగర్ నాగేశ్వరరావు మూవీలో రవితేజకు జంటగా నుపుర్ సనన్ నటిస్తుంది. నటి రేణూ దేశాయ్ ఈ చిత్రంతో కమ్ బ్యాక్ ఇస్తున్నారు. ఆమె కీలక రోల్ లో నటించారు. మురళీ శర్మ, అనుపమ్ ఖేర్ వంటి టాలెంటెడ్ యాక్టర్స్ భాగమయ్యారు. అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Bigg Boss 9 Finale Voting : కళ్యాణ్ పడాల , తనూజ మధ్య అసలు పోటీ.., ఫినాలే ఓటింగ్ లో ఎవరు ముందున్నారంటే?
Bigg Boss Telugu 9: రీతూ కాదు, తనూజ వెంటపడేవాడిని.. షాకిచ్చిన డీమాన్‌ పవన్‌.. బిగ్‌ బాస్‌ ఎమోషనల్‌ జర్నీ