Oscar 2022: వినికిడి లోపంతో ఆస్కార్‌.. చరిత్ర సృష్టించిన బెస్ట్ సపోర్టింగ్‌ యాక్టర్స్

Published : Mar 28, 2022, 08:36 AM IST
Oscar 2022: వినికిడి లోపంతో ఆస్కార్‌.. చరిత్ర సృష్టించిన బెస్ట్ సపోర్టింగ్‌ యాక్టర్స్

సారాంశం

94వ అకాడమీ అవార్డుల వేడుక గ్రాండ్‌గా జరుగుతుంది. ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ సహాయ నటి విభాగంలో ఇద్దరు నటులు చరిత్ర సృష్టించారు. హాట్‌ టాపిక్‌ అయ్యారు. 

ఆస్కార్‌ వేడుక కన్నుల పండగగా జరుగుతుంది. 94వ అకాడమీ అవార్డులు ఆదివారం సాయంత్రం(ఇండియాలో సోమవారం) లాస్‌ ఏంజెల్స్ లో వైభవంగా జరుగుతున్నాయి. ఎన్నో మెరుపులతో ఈ అవార్డుల వేడుక కనువిందుగా సాగుతుంది. ప్రధానంగా హాలీవుడ్‌ సినిమాలకు అందించిన ఈ అవార్డుల వేడుకకి లాస్‌ ఏంజెల్స్ లోని డల్బీ థియేటర్‌ వేదిక కాగా, అమెరికా తారలతోపాటు ఇతర దేశాల సినీ ప్రముఖులు సైతం హాజరై సందడి చేశారు. 

ఇదిలా ఉంటే అవార్డు వేడుకలో ఉత్తమ సహాయ నటుల విభాగంలో మేల్‌, ఫీమేల్‌ చరిత్ర సృష్టించారు. బెస్ట్ సపోర్టింగ్‌ యాక్టర్‌గా అమెరికా నటుడు, ఫిల్మ్ మేకర్‌ ట్రాయ్‌ కోస్టర్‌ ఆస్కార్‌ని దక్కించుకున్నారు. ఆయన `కోడా` సినిమాకిగానూ ఈ అత్యుత్తమ అవార్డుని గెలుపొందారు. అయితే ఆయన వినికిడి(డెఫ్‌) లోపంతో బాధపడుతుండటం విశేషం. ఇలా వినికిడి లోపంతో ఆస్కార్‌ విన్నర్‌గా నిలిచిన రెండో నటుడిగా ట్రాయ్‌ కోస్టర్‌ చరిత్ర సృష్టించారు. అయితే అవార్డు అందుకున్నవారిలో మాత్రం ఫస్ట్ యాక్టర్‌ గా ట్రాయ్‌ నిలవడం విశేషం. 53ఏళ్ల వయసులో ఆయన ఈ పాపులర్‌ అవార్డుని సొంతం చేసుకున్నారు. 

ఈ సందర్భంగా ట్రాయ్‌ మాట్లాడుతూ, మా నాన్నమా కుటుంబంలో అత్యుత్తమ సైన్‌ చేసేవారు. కానీ ఆయన కారు ప్రమాదంలో పక్షవాతానికి గురయ్యారని తన సైన్‌ లాంగ్వేజ్‌లో వెల్లడించడం విశేషం. నాన్న నుంచి నేను చాలా నేర్చుకున్నాఉన. ఎల్లప్పుడూ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను నాన్న. నువ్వే నా హీరో` అంటూ ఎమోషనల్‌ అయ్యారు. అందరిని భావోద్వేగానికి గురి చేశారు. ఈ సందర్భంగా అతిథులకు, వేదికకి, ఆస్కార్ కి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 

మరోవైపు బెస్ట్ సపోర్టింగ్‌ యాక్ట్రెస్‌ కూడా చరిత్ర సృష్టించింది. `వెస్ట్ సైడ్‌ స్టోరీ` అనే సినిమాకిగానూ ఉత్తమ సహాయ నటిగా అమెరికా నటి, సింగర్‌ అరియానా డేబోస్‌ ఆస్కార్‌ని దక్కించుకున్నారు. బెస్ట్ సపోర్టింగ్‌ యాక్ట్రెస్‌గా ఆస్కార్‌ని సొంతం చేసుకున్న మొదటి ఆఫ్రికా- లాటిన్‌ అమెరికా నటిగా ఆమె చరిత్ర సృష్టించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. 

`మనం జీవిస్తున్న ఈ వింత ప్రపంచంలో కూడా కలలు నిజమవుతాయని ఈ అవార్డు నిరూపించిందని ఎమోషనల్‌ అయ్యారు అరియానా. ఈ సందర్భంగా తనకు అండగా నిలిచిన తల్లికి ధన్యవాదాలు తెలిపారు.  ఎవరైనా వారి గుర్తింపుని ప్రశ్నించిన వారికి మాకు స్థానం ఉందని సమాధానం చెప్పిన సందర్భం ఇదని ఆమె వెల్లడించారు. ఆనందంతో ఒప్పొంగిపోయారు. అంతకు ముందు ఈ చిత్రానికి గోల్డెన్‌ గ్లోబ్‌, బాఫ్టా పురస్కారాలు సొంతం చేసుకుంది. `వెస్ట్ సైడ్‌ స్టోరీ` మ్యూజికల్‌ ఫిల్మ్ కావడం విశేషం. ఆమె డాన్సర్‌గా నటించారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: తనూజకి షాక్‌.. కళ్యాణ్‌ సీక్రెట్‌ క్రష్‌ బయటపెట్టిన ఇమ్మాన్యుయెల్‌
Dhurandhar Collections: బాక్సాఫీసు వద్ద `ధురంధర్‌` కలెక్షన్ల సునామీ.. తెలుగు ఆడియెన్స్ కి గుడ్‌ న్యూస్‌