
నితిన్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘మాచర్ల నియోజకవర్గం’. కృతి శెట్టి, కేథరీన్ ట్రెసా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. రాజకీయ నేపథ్యమున్న మాస్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందుతున్నది. శ్రేష్ట్ మూవీస్ పతాకంపై సుధాకర్‌రెడ్డి, నికితారెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో ఎంఎస్ రాజశేఖర్‌రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమా తాజాగా భారీ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. తాజాగా ఈ చిత్రం టీజర్ ను భారీ ఎత్తున విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. నితిన్ పుట్టి నరోజు సందర్బంగా ఈ టీజర్ రిలీజ్ చేస్తారు. ఈ మేరకు పోస్టర్ రిలీజ్ చేసారు.
ఈ సినిమాలో నితిన్ ఒక స్టూడెంట్ గాను మరియు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గానూ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 29న విడుదల కాబోతోందని దర్శకనిర్మాతలు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.
హీరో నితిన్ మాట్లాడుతూ....‘స్టంట్ మాస్టర్ అనల్ అరసు కంపోజ్ చేసిన యాక్షన్ ఎపిసోడ్‌తో భారీ షెడ్యూల్‌ను పూర్తి చేశాం. జానీ మాస్టర్ కొరియోగ్రాఫ్ చేసిన పాటను కూడా చిత్రీకరించాం. త్వరలో ఫస్ట్ లుక్, టీజర్ విడుదల వివరాలు తెలియజేస్తాం’ అని అన్నారు.
ఇక నితిన్ హీరోగా ఈమధ్యనే ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా "మాస్ట్రో ". హిందీ లో "అందాధున్" కి తెలుగు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా ఓటీటీలో విడుదలై జస్ట్ ఓకే అనిపించింది. తాజాగా ఇప్పుడు తన ఆశలన్నీ తన తదుపరి సినిమా అయిన "మాచర్ల నియోజకవర్గం" పైనే పెట్టుకున్నాడు నితిన్. ఉప్పెన సినిమాతో సూపర్ హిట్ అందుకొని ఈ మధ్యనే బంగార్రాజు, శ్యామ్ సింగరాయి సినిమాల్లో కూడా కనిపించిన కృతి శెట్టి ఈ సినిమాలో హీరోయిన్ గా నటించటం ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం : మహతి స్వరసాగర్, సినిమాటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వరరావు.