ఛత్రపతి డిజాస్టర్... రామ్ పోతినేనికి చెమటలు!

Published : May 14, 2023, 04:16 PM ISTUpdated : May 14, 2023, 04:21 PM IST
ఛత్రపతి డిజాస్టర్... రామ్ పోతినేనికి చెమటలు!

సారాంశం

ఛత్రపతి రీమేక్ తో హిందీలో పాగా వేయాలనుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి భారీ షాక్ తగిలింది. ఆ చిత్రం కనీస ఆదరణ దక్కించుకోలేదు. ఛత్రపతి రిజల్ట్ చూసిన రామ్ పోతినేని బెంబేలెత్తుతున్నాడని సమాచారం.   

వాపును చూసి బలం అనుకుంటే ఫలితాలు ఇలానే ఉంటాయి. యూట్యూబ్ లో వందల మిలియన్స్ వ్యూస్ చూసి భ్రమపడిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఛత్రపతి రీమేక్ చేసి చేతులు కాల్చుకున్నాడు. నిర్మాతలను నిండా ముంచేశాడు. ఉన్న ఇమేజ్ దారుణంగా డ్యామేజ్ చేసుకున్నాడు. టాలీవుడ్ హీరోలకు పాన్ ఇండియా పిచ్చి పట్టింది. ఇక్కడ కనీసం ఓ స్థాయికి వెళ్లకుండానే నార్త్ ఇండియాను ఏలేయాలని చూస్తున్నారు. మాకేం తక్కువ. మేము కూడా హిందీ పరిశ్రమను దున్నేస్తామని కలలు కంటున్నారు. అది అంత ఈజీ కాదని ఒక్కొక్కరికీ తెలిసొస్తుంది. 

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కెరీర్లో సాలిడ్ హిట్ ఒక్కటంటే ఒక్కటి లేదు. డెబ్యూ మూవీ అల్లుడు శ్రీను, జయ జానకి నాయక పర్లేదనిపించాయి. ఆయన గత చిత్రం అల్లుడు అదుర్స్ డిజాస్టర్. అంతకు ముందు చేసిన సాక్ష్యం డబుల్ డిజాస్టర్. ఇలాంటి ట్రాక్ పెట్టుకొని ఆయన ఏకంగా బాలీవుడ్ లో జెండా పాతాలని ప్లాన్ వేశాడు. నార్త్ ఇండియన్స్ నా ఫ్యాన్స్ అని ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఛత్రపతి రీమేక్ చేశాడు. ఈ సాహసానికి పూనుకోవడానికి ఒకే ఒక కారణం... యూట్యూబ్. 

సాధారణంగా అన్ని సౌత్ చిత్రాలు హిందీలో డబ్ చేసి యూట్యూబ్ లో విడుదల చేస్తారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సినిమాలు కూడా అలా డబ్ చేసి యూట్యూబ్ లో పెట్టారు. వాటికి వందల మిలియన్స్ వ్యూస్ వచ్చాయి. డిజాస్టర్ సినిమాలు కూడా భారీ ఆదరణ దక్కించుకున్నాయి. ఇంకేముంది నార్త్ ఆడియన్స్ నేనంటే పడి ఛస్తున్నారు. హిందీ సినిమా చేస్తే బాక్సాఫీస్ బద్దలే అని గుడ్డిగా ముందుకు వెళ్ళాడు. ఆ ఎంచుకునే సినిమా ఏదో కాంటెంపరరీ సబ్జెక్టు తీసుకుంటే బాగుండేది. 20 ఏళ్ల క్రితం నాటి ఛత్రపతి చిత్రాన్ని రీమేక్ చేశాడు. కనీసం కోటి రూపాయల వసూళ్లు రాలేదు. 

బెల్లంకొండ మాదిరే పాన్ ఇండియా అంటూ ఊగుతున్న మరో హీరో రామ్ పోతినేని. ఈయన కాన్ఫిడెన్స్ కి కూడా కారణం ఆ యూట్యూబే. రామ్ చిత్రాల హిందీ డబ్బింగ్ వెర్షన్స్ యూట్యూబ్ షేక్ చేశాయి. అందుకే నెక్స్ట్ పాన్ ఇండియాకి రెడీ అయ్యాడు. బోయపాటి శ్రీనుతో చేస్తున్న మూవీ హిందీలో కూడా విడుదల కానుంది. ఛత్రపతి రిజల్ట్ చూశాక రామ్ కి చెమటలు పట్టాయని సమాచారం. యూట్యూబ్ ఆడియన్స్ కి థియేటర్ ఆడియన్స్ కి సంబంధం ఉండదని తేలిపోయింది. ఖాళీగా ఉండి పైసా ఖర్చు లేకుండా యూట్యూబ్ లో సినిమాలు చూసే ఆడియన్స్ సమయం వెచ్చించి టికెట్స్ కొని థియేటర్స్ లో సినిమా చూడరని తెలిసొచ్చి ఉంటుంది. రేపు నార్త్ లో మన సినిమా పరిస్థితి కూడా  ఇంతే అని రామ్ కి చెమటలు పట్టడం ఖాయమంటున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Today Episode: దీప, కార్తీక్ లపై రెచ్చిపోయిన పారు, జ్యో- శ్రీధర్ పదవి పోయినట్లేనా?
Gurram Paapi Reddy Review: గుర్రం పాపిరెడ్డి మూవీ రివ్యూ, రేటింగ్‌.. బ్రహ్మానందం, యోగిబాబు సినిమా ఎలా ఉందంటే?