దొంగ బయోపిక్ లో బెల్లంకొండ!

Published : Dec 21, 2018, 03:49 PM ISTUpdated : Dec 21, 2018, 03:53 PM IST
దొంగ బయోపిక్ లో బెల్లంకొండ!

సారాంశం

1970 కాలంలో స్టువర్ట్ పురం కి చెందిన టైగర్ నాగేశ్వరరావు అనే దొంగ బయోపిక్ కి ప్రీ ప్రొడక్షన్ పనులు మళ్ళీ మొదటికొచ్చాయి. మొదట్లో రానా ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నా సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు బెల్లకొండ హీరో ఆ ఛాన్స్ కొట్టేశాడని తెలుస్తోంది

1970 కాలంలో స్టువర్ట్ పురం కి చెందిన టైగర్ నాగేశ్వరరావు అనే దొంగ బయోపిక్ కి ప్రీ ప్రొడక్షన్ పనులు మళ్ళీ మొదటికొచ్చాయి. మొదట్లో రానా ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నా సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు బెల్లకొండ హీరో ఆ ఛాన్స్ కొట్టేశాడని తెలుస్తోంది. దొంగతనం చేసి ఆ డబ్బును పేదలకు పంచి సరికొత్త రాబిన్ హుడ్ గా పిలవబడే నాగేశ్వరరావు బయోపిక్ లో కంటెంట్ ఎంతో ఉంది. 

ఎమోషన్స్ ప్లస్ యాక్షన్ సీన్స్ కు కావాల్సినంత స్పెస్ ఉంది. అందుకే ఆ కథను సొంత ప్రొడక్షన్ లో చేయాలనీ మొన్నటివరకు రానా గట్టి ప్రయత్నాలు చేశాడు. కానీ ఏమైందో ఏమో ఇటీవల ఆ బయోపిక్ కి కథానాయకుడిగా బెల్లకొండ శ్రీనివాస్ ను సెలెక్ట్ చేశారు. కిట్టు ఉన్నాడు జాగ్రత్త సినిమాతో పర్వాలేదనిపించిన యువ దర్శకుడు వంశీ కృష్ణ బయోపిక్ కి సంబందించిన ఫుల్ స్క్రిప్ట్ ను సిద్ధం చేసుకున్నాడు. 

ఇక బెల్లకొండ వారసుడు సింగిల్ సిట్టింగ్ లో కథను ఒకే చేయడంతో త్వరలోనే సినిమా షూటింగ్ ను స్టార్ట్ చేయాలనీ చిత్ర యూనిట్ ఫిక్స్ అయ్యింది. రీసెంట్ గా శ్రీనివాస్ నటించిన కవచం భారీ స్థాయిలో రిలీజ్ అయినప్పటికీ డిజాస్టర్ గా నిలిచింది. వరుస అపజయాలను ఎదుర్కొంటున్న బెల్లకొండ హీరో ఈ సినిమాతో ఎంతవరకు సక్సెస్ అందుకుంటాడో చూడాలి.

PREV
click me!

Recommended Stories

Gunde Ninda Gudi Gantalu Today డిసెంబర్ 10 ఎపిసోడ్ : డబ్బులు ఇస్తూ బుద్ధి బయటపెట్టిన మనోజ్, వద్దని షాకిచ్చిన బాలు..!
Mahesh Babu ఎవరో నాకు తెలియదు.. ప్రభాస్ తప్ప అంతా పొట్టివాళ్లే.. స్టార్‌ హీరోయిన్‌ సంచలన వ్యాఖ్యలు