కొన్ని ఊహించని పరిణామాలుఅందరిని ఆశ్చర్యపరుస్తాయి. కొంత మంది సామాన్యులు కూడా ఓవర్ నైట్ స్టార్లు అయినసందర్భాలుఉన్నాయి. అటువంటి వారిలో ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్నది బర్రెలక్క. మరి బర్రెలక్క బిగ్ బాస్ లోకి వస్తే ఎలా ఉంటంది..? ప్రస్తుతం నడుస్తున్న న్యూస్ అదే..? మరి ఇందులో నిజంఎంత. .?
బిగ్ బాస్ తెలుగు సరికొత్త ఆవిష్కణతో..కొత్త కొత్త గేమ్ లతో.. సరికొత్తగా ప్లాన్ చేయబడింది. ప్రతి ఏడాది సరికొత్త సీజన్స్ తో ప్రేక్షకులను అలరిస్తుంది బిగ్ బాస్. ఇక ఈసారి కూడా కాస్త తెలిసినవారు.. అసలుముఖం చూడనివారు.. ఇలా సాగిపోతోంది గేమ్ షో. ఇక బిగ్ బాస్ హౌస్ లో పాల్గొనే కంటెస్టెంట్స్ లో కొంతమంది మనకు తెలిసిన వాళ్లు ఉంటే చాలా మంది కొత్త వాళ్లే ఉంటారు. ఇక ఈసారి షోలో కూడా అందరికి తెలిసిన సీరియల్ బ్యాచ్ తో పాటు.. ఎప్పుడోఒక సినిమా చేసిన వారు. య్యూట్యూబర్లు.. సందడి చేస్తున్నారు. అయితే గత సీజన్లలో వచ్చిన రేటింగ్ నుదృష్టిలో పెట్టుకుని.. బిగ్ బస్ హౌస్ లోకి వెళ్ళేవారి విషయంలో జాగ్రత్తలు పాటిస్తున్నారట టీమ్. తాజాగా బిగ్ బాస్ కు సబంధించిన ఓ న్యూస్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ప్రస్తుతం పొలిటికల్ గా..సోషల్ మీడియా పరంగా బాగా పాపులర్ అవుతోంది బర్రెలక్క అలియాస్ శిరీష. బాగా చదివిని నిరుధ్యోగి అయిన ఆమె.. ఉద్యోగం రాక.. బర్రెలు కాసుకుంటూ..ఆ వీడియోతో ఫేమస్అయ్యింది. ఇక ఈమె బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి. నెట్టింట్లో బాగా పాపులర్ అయ్యి.. ఫాలోయింగ్ తో పాటు.. తాజాగా సెక్యూరిటీ కూడా పొందిన బర్రెలక్కను బిగ్ బాస్ హౌస్ లోకి రప్పించడానికి ప్రయత్నాలుజరుగుతున్నాయట. అయితే ఇప్పటికే ఓ రెండు వారాలుమాత్రమే మిగిలి ఉంది బిగ్ బాస్ హౌస్. మరిఈలోపు ఆమెను గెస్ట్ గా తీసుకెళ్తారా.. లేక వైల్డ్ కార్డ్ ఎంట్రీనా.. అని అంతా ఆలోచనలో పడ్డారు అయితే ఇక్కడేచిన్న ట్విస్ట్ ఉంది.
undefined
బిగ్ బాస్ ట్విస్ట్ ఎంటంటే..? బర్రెలక్కను ఇప్పుడు ఆసీజన్ లో కాకుండా..నెక్ట్స్ సీజన్ వరకూ హౌస్ లోకి తీసుకోవాలి అని చూస్తున్నారట. ప్రభుత్వానికి వ్యాతిరేకంగా బర్రెలక్క చేసిన వీడియో బాగా వైరల్ అయ్యింది. దాంతో ఆమె ఇప్పుడు రాజకీయాల్లోకి కూడా వచ్చేసింది. స్వత్రంత్ర అభ్యర్థిగా నామినేషన్ కూడా వేసింది. ఈ క్రమంలోనే ఆమె సోదరుడి పై దాడి జరగడం.. ఆమెకు హైకోర్టు సెక్యూరిటీ ఇవ్వడంతో ఇప్పుడు బర్రెలక్క బాగా ఫేమస్ అయ్యింది. దాంతో ఆమె నెక్ట్స్ ఇయర్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టడం ఖాయం అంటూ రూమర్స్ మొదలయ్యాయి.
బర్రెలక్క కు వచ్చిన క్రేజ్ ను వాడుకోవడానికి బిగ్ బాస్ ప్రయత్నిస్తుందని .. ఇప్పటి నుంచే ఆమెను సంప్రదింపులు కూడా జరుపుతున్నారని.. ఎలక్షన్స్ తర్వాత దీని పై పూర్తి క్లారిటీ వస్తుందని టాక్ వినిపిస్తుంది. మరోవైపు ఈ వార్తల్లో వాస్తవం లేదని.. భవిషత్తులో బిగ్ బాస్ ఛాన్స్ వచ్చే అవకాశం లేకపోలేదని అంటున్నారు కొందరు.