బ్యాంక్ కు అప్పు.. వేలానికి బాలీవుడ్ స్టార్ సన్నీడియోల్ విల్లా.. ఎన్నికోట్లు బకాయి ఉన్నారంటే?

By Asianet News  |  First Published Aug 20, 2023, 8:38 PM IST

‘గదర్ 2’ చిత్రం గ్రాండ్ సక్సెస్ తో సన్నీ డియోల్ పేరు ప్రస్తుతం మారుమోగుతోంది. మరోవైపు ఈ బాలీవుడ్ సీనియర్ నటుడు గురించి షాకింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. ఓ బ్యాంక్ కు అప్పు ఎగ్గొట్టడంతో.. ఆయన ఇంటిని వేలం వేయబోతున్నట్టు తెలుస్తోంది. 
 


బాలీవుడ్ సీనియర్ నటుడు, సిట్టింగ్ ఎంపీ సన్నీ డియోల్ (Sunny Deol)  1983 నుంచి నటుడిగా కెరీర్ కొనసాగిస్తున్నారు. ఎన్నో చిత్రాల్లో నటించి బాలీవుడ్ లో తనదైన ముద్రవేసుకున్నారు. ఇప్పటికీ వరుస చిత్రాలతో అలరిస్తూనే ఉన్నారు. గతవారం సన్నీ డియోల్ నటించిన పీరిడియడ్ యాక్షన్ డ్రామా Gadar 2 థియేటర్లలో విడుదలై అదరగొడుతోంది. ప్రేక్షకాదరణ పొందడంతో పాటు బాక్సాఫీస్ వద్ద కూడా దుమ్ములేపుతోంది. వారంలోనే ఏకంగా రూ.430 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. 2023లో సెకండ్ హయ్యేస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్ గా రికార్డు క్రియేట్ చేసింది.

‘గదర్ 2’ భారీ సక్సెస్ తో సన్నీ డియోలో పేరు మారుమోగుతోంది. సోషల్ మీడియాలో ఆయన విజువల్స్ కూడా ట్రెండ్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే.. సన్నీ డియోల్ కు సంబంధించిన మరో న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. డిసెంబర్ 2022 నుండి బ్యాంక్ ఆఫ్  బరోడాకు చెల్లించాల్సిన రూ. 55.99 కోట్ల రుణం, వడ్డీని సన్నీ డియోల్ చెల్లించడం లేదు. కనీసం బ్యాంక్ నోటీసులకూ స్పందించడం లేదంట. దీంతో బ్యాంక్ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. 

Latest Videos

undefined

ముంబైలో గల మెగాపోలిస్‌లోని టోనీ జుహు ప్రాంతంలోని గాంధీగ్రామ్ రోడ్‌లో ఉన్న సన్నీ డియోల్ విల్లాను వేలం వేయనున్న బ్యాంక్ ప్రకటన విడుదల చేసింది. టెండర్లను ఆహ్వానించింది. ఈ మేరకు పత్రిక ప్రకటన ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ప్రటకనలో ఆ ఆస్తిని అటాచ్ చేసిన బ్యాంక్, వేలం కోసం రిజర్వ్ ధరను రూ. 51.43 కోట్లుగా నిర్ణయించింది. వేలానికి రూ. 5.14 కోట్లు డిపాజిట్‌గా వెల్లడించింది. 

2002 సర్ఫేసీ చట్టంలోని నిబంధనల ప్రకారం వేలాన్ని నిరోధించేందుకు బ్యాంకుకు బకాయిలను క్లియర్ చేసే అవకాశం డియోల్స్‌కు ఇంకా ఉందని టెండర్ నోటీసులో పేర్కొనడం విశేషం. ఆగస్ట్ 25న జరగనున్న ఇ-వేలం ద్వారా రూ. 56 కోట్లను రికవరీ చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. దీనిపై సన్నీ డియోల్ ఎలా స్పందిస్తారో చూడాలి. 

పంజాబ్ లోని గురుదాస్‌పూర్ MPగా సన్నీ డియోల్ ఉన్నారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో పంజాబ్ స్థానం నుండి అధికార బిజెపికి ప్రాతినిధ్యం వహిస్తూ పోటీ చేశారు. అప్పటి కాంగ్రెస్ సభ్యుడు సునీల్ ఝాకర్‌ను ఓడించి భారీ మెజారిటీతో గెలుపొందారు. 

click me!