బందోబస్త్ టీజర్: సూర్య యాక్షన్ మోడ్

Published : Jul 06, 2019, 06:27 PM IST
బందోబస్త్ టీజర్: సూర్య యాక్షన్ మోడ్

సారాంశం

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన కాప్పాన్ తెలుగులో బందోబస్త్ గా రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే సినిమాకు సంబందించిన తెలుగు టీజర్ ను చిత్ర యూనిట్  నేడు రిలీజ్ చేసింది. కెవి ఆనంద్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో సూర్య డిఫరెంట్ గెటప్స్ లో కనిపిస్తున్నాడు.   

సీక్రెట్ ఇంటిలిజెన్స్ ఆఫీసర్ గానే కాకుండా ఒక టెర్రరిస్ట్ గా అలాగే గ్రామంలో ఒక సాధారణ యువకుడిగా కనిపించడం ఆడియెన్స్ ని ఆకట్టుకుంటోంది. గతంలో కెవి ఆనంద్ - సూర్య కాంబినేషన్ లో వచ్చిన వీడోక్కడే - బ్రదర్స్ మంచి పాజిటివ్ టాక్ ను తెచ్చుకున్నాయి. ఇక అదే తరహాలో బందోబస్త్ అంచనాలను రేపుతోంది. 

మోహన్ లాల్ క్యారెక్టర్ కూడా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తోంది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో సాగే యాక్షన్ అడ్వెంచర్ లా ఉందని టీజర్ పై పాజిటివ్ గా కామెంట్ చేస్తున్నారు. ఇక సినిమాను ఆగస్ట్ 30న రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

'రౌడీ జనార్ధన' గ్లింప్స్ రివ్యూ.. కింగ్డమ్ లా గురి తప్పేలా లేదు, విజయ్ దేవరకొండ బీభత్సం చూశారా
'నారీ నారీ నడుమ మురారి' టీజర్ రివ్యూ..రవితేజ, శర్వానంద్ ఇద్దరిలో ఎవరో ఒకరికి డ్యామేజ్ తప్పదా ?