
ఈశ్వరా.. పవనేశ్వరా అంటూ ఓ వేదికపై మహాశివుడిని రావణాసురుడు స్తుతించిన రేంజ్ లో బండ్ల గణేష్(Pawan Kalyan) పవన్ ని ఎలివేట్ చేయగా.. ఫ్యాన్స్ ఊగిపోయారు. పవన్ కళ్యాణ్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో బండ్ల గణేష్ స్పీచ్ స్పెషల్ ట్రీట్. పవన్ గురించి మాట్లాడాల్సిన సందర్భం ఏదైనా ఉంటే, బండ్ల గణేష్ పేజీలకు పేజీలు స్పీచ్ రాసుకుంటారు. పవన్ ఈ భూమిపై నడిచే దేవుడిగా అభివర్ణిస్తాడు. కాగా భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముందు జరిగిన ఓ సంఘటన మొత్తం మార్చేసింది.
భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ వేడుకకు నాకు ఆహ్వానం అందలేదు. త్రివిక్రమ్ నేను వస్తే డామినేట్ ఐపోతాడని తెలిసి, రాకుండా అడ్డుకుంటున్నాడట... అంటూ బండ్ల గణేష్ (Bandla Ganesh)ఓ అభిమానితో ఫోన్ కాల్ మాట్లాడారు. ఈ ఆడియో ఫైల్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే ఆ వాయిస్ నాది కాదని బండ్ల వివరణ ఇచ్చారు. కానీ ఈ సంఘటన తర్వాత బండ్ల గణేష్-పవన్ మధ్య దూరం పెరిగిందన్న సమాచారం ఉంది. పవన్ బండ్ల గణేష్ ని దగ్గరకు రానీయడం లేదట.
కాగా నాని లేటెస్ట్ మూవీ అంటే సుందరానికీ (Ante Sundaraniki)ప్రీ రిలీజ్ వేడుక గెస్ట్ గా పవన్ కళ్యాణ్ హాజరవుతున్నారు. ఈ క్రమంలో బండ్ల గణేష్ కూడా వస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తూ.. ఓ అభిమాని మీమ్ పోస్ట్ చేశారు. సదరు మీమ్ ట్యాగ్ చేస్తూ, బండ్ల గణేష్ ధన్యవాదాలు అన్నట్లు నమస్కారం ఎమోజి పోస్ట్ చేశారు. నేను కూడా ఇదే కోరుకుంటున్నాను. నాకు ఆహ్వానం ఉంటే బాగుండు అన్నట్లు బండ్ల గణేష్ ట్వీట్ తెలియజేస్తుంది. మరి బండ్ల గణేష్ కోరిక ఎంత వరకు నెరవేరుతుందో చూడాలి. జూన్ 9న హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఈ ఈవెంట్ జరగనుంది.
ఇక ఈ వేదికపై పవన్ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఆయన రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో మాదిరి పొలిటికల్ కామెంట్స్ చేస్తే, నాని సినిమాపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఏపీలో టికెట్స్ ధరల తగ్గింపును పవన్ కళ్యాణ్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ విషయంలో నాని(Nani) సైతం అసహనం వ్యక్తం చేశారు. కిరాణా కొట్టు కలెక్షన్స్ కంటే సినిమా థియేటర్స్ వసూళ్లు తక్కువగా ఉంటున్నాయంటూ సెటైర్లు వేశారు. ఈ సారూప్యతే పవన్ ని నాని సినిమా వేడుక గెస్ట్ గా వచ్చేలా చేసిందన్న వాదన వినిపిస్తుంది.