బండ్ల గణేష్‌కి కరోనా.. మూడోసారి వదలని మహమ్మారి

Published : Jan 09, 2022, 09:55 PM IST
బండ్ల గణేష్‌కి కరోనా.. మూడోసారి వదలని మహమ్మారి

సారాంశం

కరోనా మహమ్మారి నిర్మాత, నటుడు బండ్ల గణేష్‌ని వదలడం లేదు. వరుసగా ఆయన్ని వెంటాడుతుంది. తాజాగా మరోసారి కరోనా సోకినట్టు బండ్ల గణేష్‌ ఆదివారం సాయంత్రం వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. 

నిర్మాత, నటుడు బండ్ల గణేష్‌(Bandla Ganesh) మూడోసారి కరోనా(Corona) బారిన పడ్డారు. ఆయన సెకండ్‌ వేవ్‌ సమయంలో ఓ సారి వైరస్‌కి గురైన విషయంతెలిసిందే. తాజాగా మరోసారి కరోనా సోకినట్టు Bandla Ganesh ఆదివారం సాయంత్రం వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. `గత మూడు రోజులు నేను ఢిల్లీలో ఉన్నాను. ఈరోజు కొద్దిగా లక్షణాలు ఉంటే పరీక్షలు చేయించుకోగా కోవిడ్‌ పాజిటివ్‌ అని తేలింది. నా కుటుంబ సభ్యులకు నెగిటివ్‌ వచ్చింది. దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాలు చేసేముందు ఒక్కసారి ఆలోచించుకోండి. అందరూ సురక్షితంగా ఉండండి` అంటూ బండ్ల గణేష్‌ ట్వీట్‌ చేశారు. ఈ సందర్బంగా మెడికల్ రిపోర్ట్ ని ఆయన ట్వీట్టర్‌ ద్వారా పంచుకున్నారు. 

ఇప్పటికే గతంలో రెండుసార్లు బండ్ల గణేష్‌ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. పవన్‌ కళ్యాణ్‌ నటించిన `వకీల్‌సాబ్‌` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ అనంతరం ఆయనకు కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్ట్ చేయించుకోగా, కరోనా అని తేలిసింది. కరోనా ఫస్ట్ వేవ్‌ సమయంలోనూ ఆయన కరోనా బారిన పడ్డారు. కానీ సెకండ్‌ వేవ్‌ సమయంలో ఆయనకు సీరియస్‌ అయ్యింది. దీంతో అపోలో ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స తీసుకున్నారు. ఆ సమయంలో చిరంజీవిగారు తనకు సహాయం చేశారని వెల్లడించారు బండ్ల గణేష్‌. ఇప్పుడు మూడోసారి కరోనా సోకడం విచారకరం. 

ఇప్పటికే చాలా మంది తారలు కరోనా బారిన పడ్డారు. తెలుగు, తమిళంలోనూ వరుసగా సెలబ్రిటీలు కరోనాకి గురవుతున్నారు. టాలీవుడ్‌లో మహేష్‌బాబు, రాజేంద్రప్రసాద్‌, మంచు మనోజ్‌ కరోనా బారిన పడ్డారు. అలాగే తమిళనాటు విష్ణు విశాల్‌,  త్రిష, అరుణ్‌ విజయ్‌, వడివేలు, మీనా, సత్యరాజ్‌, దర్శకుడు ప్రియదర్శన్‌ కరోనా బారిన పడ్డారు. బాలీవుడ్‌లో బోనీ కపూర్‌, ఏక్తా కపూర్‌, జాన్‌ అబ్రహం, ఆయన భార్య ప్రియా రుంచల్‌, విశాల్‌ డడ్లానీ,స్వర భాస్కర్‌, మృణాల్‌ ఠాకూర్‌, అర్జున్‌ కపూర్‌, ప్రేమ్‌ చోప్రా వంటి వారు కరోనా సోకిన విషయం తెలిసిందే. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Prabhas: రాజాసాబ్ హీరోయిన్ తో ప్రభాస్ డేటింగ్ ? మళ్ళీ రూమర్స్ షురూ, కానీ
దళపతి విజయ్ 'జన నాయగన్' కథ లీక్.. టాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీకి రీమేక్ ?