రేణు పై పవన్ ట్వీట్, స్పందించిన బండ్ల గణేష్

First Published Jun 26, 2018, 12:38 PM IST
Highlights

పవన్ ట్వీట్ బండ్ల గణేష్ ఏమన్నాడో తెలుసా..?

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ మ‌రికొద్ది రోజుల్లో మ‌రో వ్యక్తితో పెళ్లి పీట‌లు ఎక్క‌నున్నారు. ఇటీవ‌లె రేణు నిశ్చితార్థం జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. నిశ్చితార్థం ఫోటోల‌ను త‌న సోష‌ల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసిన రేణు త‌నకు కాబోయే భ‌ర్త ఫోటోల‌ను మాత్రం రివీల్ చేయ‌లేదు. ఈ సంద‌ర్భంగా రేణూ దేశాయ్‌కు ప‌వ‌ర్‌స్టార్ ట్విట‌ర్ ద్వారా విషెస్ తెలియ‌జేశారు. `కొత్త జీవితం ప్రారంభించ‌బోతున్న రేణుగారికి నా శుభాకాంక్ష‌లు. ఆమె ఎల్ల‌ప్పుడూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాల‌ని ఆ దేవుణ్ని ప్రార్థిస్తాన‌`ని ప‌వ‌న్ ట్వీట్ చేశారు. 

ఈ ట్వీట్‌పై ప‌వ‌న్‌ను ఎంత‌గానో అభిమానించే నిర్మాత బండ్ల గ‌ణేష్ కూడా స్పందించారు. ప‌వ‌న్ చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేసిన బండ్ల గ‌ణేష్‌.. `మా బాస్ అంటే ఇది` అంటూ ప్ర‌శంసించారు. ఇక ప‌వ‌న్ ట్వీట్ ప‌ట్ల ఆయ‌న అభిమానులు కూడా ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. ఇలాంటి స్వ‌చ్ఛ‌మైన మ‌నస్తత్వ‌మే త‌మ‌ను ఆక‌ర్షిస్తోంద‌ని ప‌వ‌న్ అభిమానులు ట్వీట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

click me!