స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తాజాగా కుటుంబ సభ్యులందరితో కలిసి సొంతూరిలో ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంతో కొన్నాళ్లుగా వస్తున్న రూమర్లకు చెక్ పెట్టారు. ఈ ఫొటోలపై బండ్ల గణేష్ చేసిన కామెంట్ సైతం వైరల్ గా మారింది.
తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేని దర్శకుడు పూరీ జగన్నాథ్. ఎందరో హీరోలకు బ్లాక్ బాస్టర్ చిత్రాలను అందించి స్టార్స్ గా నిలబెట్టారు. తక్కువ సమయంలో సినిమాలను తెరకెక్కించి ఇండస్ట్రీ హిట్ కొట్టడం ఆయన ప్రత్యేకత. బద్రితో మొదలై ‘ఇస్మార్ట్ శంకర్’ వరకు పూరీ జర్నీ ఎంత ఆసక్తికరంగా సాగిందో తెలిసిందే. చివరిగా ‘లైగర్’తో కాస్తా ఎదురుదెబ్బ తగిలింది.. దీంతో కాస్తా గ్యాప్ తీసుకున్నారు.
ఈ క్రమంలో పూరీ జగన్నాథ్ చాలా కాలం తర్వాత ఫ్యామిలీతో కలిసి కనిపించారు. సొంతూరిలో మొత్తం కుటుంబ సభ్యులందరితో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భార్య లావణ్య జగన్నాథ్ తో కలిసి హోమాన్ని ఆచరించారు. కొడుకు ఆకాష్ పూరి, కూతురు పవిత్రతో కలిసి హోంలో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. చాలా కాలం తర్వాత పూరీ జగన్నాథ్ ను ఇలా ఫ్యామిలీతో హ్యాపీగా చూడటంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
ఈ క్రమంలోనే బండ్ల గణేష్ (Bandla Ganesh) కూడా సంతోషించారు. పూరీ తన భార్యను హగ్ చేసుకున్న ఫొటోలను, వారి కుటుంబ సభ్యుల ఫొటోలను ట్వీటర్ లో షేర్ చేస్తూ కామెంట్ కూడా చేశారు. ‘మిమ్మల్ని ఇలా చూస్తుంటే సంతోషంగా ఉంది అన్నా, వదిన’ అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆ ట్వీట్ కూడా వైరల్ గా మారింది. అయితే కొద్దిరోజుల కింద ‘చోర్ బజార్’ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పూరీపై బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారిన విషయం తెలిసిందే.
మరోవైపు పూరీ జగన్నాథ్ ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నారని, అందుకే ఎక్కడ చూసినా ఛార్మీతోనే కనిపిస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. అదేవిధంగా లావణ్యకు విడాకులు కూడా ఇచ్చేందుకు సిద్ధమయ్యాడని రూమర్లు పుట్టుకొచ్చాయి. లాస్ట్ ఇయర్ రూమర్లపై ఆకాష్ పూరి కూడా స్పందించిన విసయం తెలిసిందే. అవన్నీ అబద్ధాలేనని స్పష్టం చేశాడు. అయినా రూమర్లు ఆగలేదు. తాజాగా ఫొటోలతో అడ్డుకట్ట పడినట్టైంది. ఇక ‘లైగర్’తో పూరికి పెద్ద దెబ్బపడింది. దీంతో నెక్ట్స్ ప్రాజెక్ట్ ‘జన గణ మన’ కూడా ఆగిపోయింది. చిరంజీవితోనూ సినిమా కుదరలేదు. దీంతో రామ్ పోతినేనితో Ismart Shankar 2ను తీసుకురాబోతున్నట్టు తెలుస్తోంది.
Happy to see you Anna and Vadina ❤️🙏 https://t.co/F0zio9SRrM
— BANDLA GANESH. (@ganeshbandla)