'సై రా'పై నిషేధం పడనుందా..?

First Published 11, Sep 2018, 11:34 AM IST
Highlights

దాదాపు రూ.250 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోన్న 'సై రా నరసింహారెడ్డి' సినిమాపై నిషేధం విధించనున్నారా..? అంటే అవుననే సమాధానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే ఇది

దాదాపు రూ.250 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోన్న 'సై రా నరసింహారెడ్డి' సినిమాపై నిషేధం విధించనున్నారా..? అంటే అవుననే సమాధానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే ఇది తెలుగునాట మాత్రం కాదు.. కన్నడలో అని తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న ఈ సినిమాను తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో డబ్ చేసి విడుదల చేయనున్నారు.

దానికోసమే వివిధ భాషలకి చెందిన నటీనటులను ఈ సినిమాలో ఎంపిక చేసుకున్నారు. ఆ విధంగా సినిమాకు మార్కెట్ మరింత పెరుగుతుందనేది ఆలోచన. ఇలాంటి పరిస్థితుల్లో కన్నడ సినీ రంగం తీసుకోబోయే ఓ నిర్ణయం 'సై రా' సినిమాకు శాపంగా మారే అవకాశాలు ఉన్నాయి. కన్నడ మీడియా వర్గాల సమాచారం ప్రకారం.. భారీ బడ్జెట్ తో తెరకెక్కించే తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల డబ్బింగ్ వెర్షన్ ని కన్నడలో విడుదల చేయడం నిషేధించాలని సినీ పరిశ్రమపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోందట.

ఈ భారీ బడ్జెట్ డబ్బింగ్ సినిమాల కారణంగా కన్నడలో చిన్న సినిమాల పరిస్థితి దెబ్బ తింటుందని దాని కారణంగా డబ్బింగ్ సినిమాలపై నిషేధం విధించాలని కోరుతున్నారు. వచ్చే ఏడాది నుండి ఈ నిషేధం అమలులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదే గనుక జరిగితే ముందుగా ఆ ఎఫెక్ట్ పడేది 'సై రా' సినిమా మీదే. ఆ తరువాత 'సాహో' వంటి సినిమాలు కూడా ఈ నిషేధాన్ని ఎదుర్కొనే ఛాన్స్ ఉంది. మరి కన్నడ మార్కెట్ ఈ సినిమాలు నష్టపోకుండా ఏం చేస్తాయో చూడాలి!

Last Updated 19, Sep 2018, 9:22 AM IST