ఎన్టీఆర్ సినిమా ఆడియో ఫంక్షన్ క్యాన్సిలా..?

By Udayavani DhuliFirst Published 11, Sep 2018, 11:17 AM IST
Highlights

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తోన్న చిత్రం 'అరవింద సమేత వీర రాఘవ'. త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమాన్ని ఈ నెల 20న నిర్వహించాలని ప్లాన్ చేశారు

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తోన్న చిత్రం 'అరవింద సమేత వీర రాఘవ'. త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమాన్ని ఈ నెల 20న నిర్వహించాలని ప్లాన్ చేశారు.

సింపుల్ గా అతికొద్ది మంది సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించాలనుకున్నట్లు వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు ఈ ఫంక్షన్ ని క్యాన్సిల్ చేసినట్లు సమాచారం. హరికృష్ణ చనిపోయి నెల రోజులు కాకముందే ఈ వేడుక ఏర్పాటు చేయడం కరెక్ట్ కాదని భావించిన చిత్రబృందం ఆడియో ఫంక్షన్ క్యాన్సిల్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి బదులుగా అక్టోబర్ మొదటి వారంలో సినిమా ప్రీరిలీజ్ వేడుకను ఆంధ్రప్రదేశ్ లోని అమరావతి ప్రాంతంలో నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారట.

అప్పటికి హరికృష్ణ గారు మరణించి నెల రోజులు పూర్తవుతుంది కాబట్టి ఎవరూ తప్పుబట్టే అవకాశం ఉండదని అనుకుంటున్నారు. ఈ వేడుకకు చంద్రబాబు నాయుడుతో పాటు బాలకృష్ణ తదితరులు హాజరవవుతారని సమాచారం. పాటలను నేరుగా మార్కెట్ లోకి విడుదల చేయాలని అనుకుంటున్నారు. 

Last Updated 19, Sep 2018, 9:22 AM IST