ముదిరిన వివాదం.. కన్నడ టీవీ నటుడు చందన్‌ కుమార్‌ పై టాలీవుడ్ లో నిషేదం

Published : Aug 03, 2022, 02:24 PM IST
ముదిరిన వివాదం.. కన్నడ టీవీ నటుడు చందన్‌ కుమార్‌ పై టాలీవుడ్ లో నిషేదం

సారాంశం

ఓ తెలుగు టీవీ సీరియల్‌ షూటింగ్ లో  సందర్భంగా అసిస్టెంట్ డైరెక్టర్  రంజిత్‌ కుమార్‌ పై దాడి చేసిన కన్నడ టీవీ నటుడు చందన్‌ కుమార్‌ను తెలుగు సీరియల్స్‌ నుంచి నిషేధిస్తున్నట్లు తెలుగు టెలివిజన్‌ ఫెడరేషన్‌ వెల్లడించింది. 

అసిస్టెంట్ డైరెక్టర్ పై దురుసుగా ప్రవర్తించి, దాడి చేసి వల్గర్ గా మాట్లాడిన కన్నడ నటుడు చందన్‌ కుమార్‌ను బ్యాన్‌ చేస్తున్నట్టు తెలుగు టెలివిజన్ ఫెడరేషన్ హైదరాబాద్ లో మీడియా ముందు వెల్లడించారు. మా ఆత్మగౌరవం దెబ్బతీసేలా అతను ప్రవర్తించాడు. దాడి చేయడమే కాకుండా టీవీ పరిశ్రమకు చెడ్డ పేరు తెచ్చేలా తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. ఇకపై తెలుగు సీరియల్స్‌లో అతన్ని తీసుకోము అన్నారు సభ్యులు. ఇది అందరూ కలిసి తీసుకున్న నిర్ణయమన్నారు. 

కన్నడ బుల్లితెర పరిశ్రమలో నటుడు చందన్ కి మంచి గుర్తింపు ఉంది.సావిత్రమ్మ గారి అబ్బాయి సీరియల్ తో తెలుగులో గుర్తింపు సాధించిన చందన్.. ప్రస్తుతం శ్రీమతి శ్రీనివాస్ సీరియల్ లో హీరోగా చేస్తున్నాడు. చందన్ కుమార్ ఈ ఆదివారం శ్రీమతి శ్రీనివాస్  సీరియల్ షూటింగ్ లో  ఓ అసిస్టెంట్ డైరెక్టర్ ని బూతులు తిడుతూ, అతన్ని కొట్టి హంగామా చేశాడు. దీంతో ఆ అసిస్టెంట్ డైరెక్టర్ కారణం లేకుండానే బూతులు తిట్టాడని, నా తల్లిని దూషించాడని అతనితో వాదనకి దిగాడు. ఈ క్రమంలో అక్కడ పని చేస్తున్న వారంతా హీరోపై సీరియస్ అయ్యారు. 

అంతే కాదు అతను చేసిన తప్పనకు  క్షమాపణ చెప్పకపోగా.. చందన్ కుమార్ నేనేంటో చూపిస్తా అంటూ సీరియస్ అయ్యాడు. దీంతో ఆగ్రహించిన అసిస్టెంట్ డైరెక్టర్ చందన్ కుమార్ ని అందరి ముందే కొట్టాడు. అయితే ఈ విషయంలో మీడియాకు వివరణ ఇచ్చిన చందన్ కుమార్...  అమ్మకు ఆరోగ్యం బాగోలేదు. ఆమెకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నాము. నిద్ర లేక బాగా అలసిపోయిన నేను అసిస్టెంట్ డైరెక్టర్ కి ఓ ఐదు నిమిషాల తర్వాత వస్తానని డైరెక్టర్ తో చెప్పమని అన్నాను. నేను చెప్పింది ఎలా మిస్ కమ్యూనికేట్ అయ్యిందో తెలియదు. తర్వాత టీమ్ తనపై దాడికి దిగారు. అయితే ఇవేమి నేను మనసులో పెట్టుకోను. ఇది వరకు మాదిరి నా పని నేను చేసుకుంటూ పోవడానికి ప్రయత్నం చేస్తానని చందన్ చెప్పుకొచ్చారు. 

శ్రీమతి శ్రీనివాస్‌  సీరియల్ షూటింగ్ టైంలో ఈ గొడవ జరిగింది. చుట్టూ ఉన్న వాళ్ళు ఆపడానికి ప్రయత్నించగా చందన్ షూటింగ్ నుంచి వెళ్ళిపోయాడు. అయితే అక్కడితో గొడవ ముగిసింది అనుకుంటే చందన్ కన్నడ మీడియా ముందు తెలుగు పరిశ్రమపై రకరకాలుగా మాట్లాడాడు. తెలుగు బుల్లితెరని కించపరుస్తూ మాట్లాడాడు. దీంతో ఈ ఇష్యూ పెద్దదైంది. తెలుగు పరిశ్రమ గురించి తప్పుగా మాట్లాడినందుకు తెలుగు టీవీ ఫెడరేషన్ సమావేశం ఏర్పాటు చేసింది. చందన్ కుమార్ ను బ్యాన్ చేయాలని నిర్ణయించుకున్నారు. 

ఈ సమావేశంలో  బాధితుడు అసిస్టెంట్ డైరెక్టర్ మాట్లాడుతూ.... చందన్ కుమార్ కు షాట్ రెడీ అని నాలుగు సార్లు పిలిచాను, అయినా రాకుండా నన్ను కొట్టి, బూతులు తిట్టాడు. డైరెక్టర్ సర్ కి కంప్లైంట్ చేస్తే బయటకి రా దమ్ముంటే నేనెంతో చూపిస్త అన్నాడు అని బెదిరించాడు. అని అన్నాడు. ఫెడరేషన్ సభ్యులు మాట్లాడుతూ... ఇది ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కి, ఒక నటుడికి జరిగిన సమస్య. కూర్చోబెట్టి మాట్లాడితే అయిపోతుంది, కానీ అతను కన్నడ మీడియా ముందు చాలా తప్పుగా మాట్లాడాడు. ప్రాంతీయ భేదాలు తీసుకొచ్చాడు. తెలుగులో ఆర్టిస్ట్ లను సరిగ్గా చూడట్లేదు, కొట్టారు అని ఏవేవో మాట్లాడి సమస్యని తప్పు దోవ పట్టించి, పెద్దది చేశాడు. కన్నడ నుంచి చాలా మంది ఆర్టిస్టులు ఇక్కడికి వచ్చి నటిస్తున్నారు. వాళ్ళెవ్వరికి రాని సమస్య అతనికే వచ్చింది అన్నారు. 

తెలుగులో దాదాపు 60సీరియల్స్ జరుగుతుంటే కనీసం 200 మంది కన్నడ ఆర్టిస్ట్ లు పని చేస్తున్నారు. ఎవరితో సమస్య లేదు కాని చందన్ తోనే సమస్య వస్తోంది.. గతంలో కూడా అతనిపై కంప్లైయింట్స్ ఉన్నాయి. అతని యాటిట్యూడ్ ఏంటో అందరికి తెలుసు. అతను చేసిన తప్పుకు కన్నడ ఆర్టిస్టులందర్నీ సపరేట్ చేయాలని చూస్తున్నారు. తెలుగులో టాలెంటెడ్ యాక్టర్స్ లేక  కన్నడ నుంచి తెచ్చుకుంటున్నాం అని అతను అన్నాడు. మేము ట్యాలెంట్ ని ఎంకరేజ్ చేయడానికి మిమ్మల్ని పిలుస్తున్నాము. ఇక్కడ ఆర్టిస్టులు లేక కాదు. మీరు తెలుగు వాళ్ళని బ్యాన్ చేస్తే మహా అయితే ఓ 20 మందికి నష్టం. అదే మేము కన్నడ వాళ్ళని బ్యాన్ చేస్తే 200 మంది ఆర్టిస్టులు నష్టపోతారు. అది గుర్తించుకుని మాట్లాడాలి అన్నారు. 

PREV
click me!

Recommended Stories

Emmanuel lover ఎవరో తెలుసా? డాక్టర్ ను పెళ్లాడబోతున్న బిగ్ బాస్ 9 టాప్ కంటెస్టెంట్
Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్