అర్జునుడిగా బాలయ్య...తెరపైకి వస్తున్న బాలయ్య డ్రీమ్ ప్రాజెక్ట్..!

Published : Oct 19, 2020, 05:05 PM ISTUpdated : Oct 19, 2020, 05:08 PM IST
అర్జునుడిగా బాలయ్య...తెరపైకి వస్తున్న బాలయ్య డ్రీమ్ ప్రాజెక్ట్..!

సారాంశం

బాలయ్య తన అభిమానులకు దసరా పండగకు భారీ గిఫ్ట్ ఇచ్చాడు. వారు నిజంగా ఉబ్బితబ్బైయ్యే వార్త పంచుకున్నారు. ఈ పండుగ దినాలల్లో బాలయ్య అర్జునుడిగా  కనిపించి సందడి చేయనున్నాడు.

2003లో బాలయ్య తన డ్రీమ్ ప్రాజెక్ట్ నర్తనశాల ప్రారంభించారు. ఈ చిత్రాన్ని ఆయన స్వీయ దర్శకత్వంలో మొదలుపెట్టారు. అలాగే ఈ చిత్ర నిర్మాణ బాధ్యతలు కూడా ఆయన తీసుకోవడం జరిగింది. అప్పట్లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా ఈ మూవీ మారింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కించాలనుకున్న ఈ మూవీ సౌందర్య అకాల మరణంతో ఆగిపోయింది. 2004 ఎన్నికల ప్రచారం సంధర్భంగా సౌందర్య ప్రయాణిస్తున్న విమానం కూలిపోవడంతో ఆమె మరణించారు. నర్తనశాల మూవీలో ఆమె కీలకమైన ద్రౌపది పాత్ర చేస్తున్నారు. అప్పటికే కొంత భాగం షూటింగ్ జరుపుకున్న ఈ మూవీలో అర్ధాంతరంగా ఆగిపోయింది. 

ఇందులో అర్జునుడిగా నందమూరి బాలకృష్ణ, ద్రౌపది గా సౌందర్య, భీముడిగా శ్రీహరి, ధర్మరాజుగా శరత్ బాబు నటించిన దాదాపు 17 నిముషాల నిడివి ఉన్న సన్నివేశాలను ప్రేక్షకులు, అభిమానులు వీక్షించడానికి వీలుగా ఈ విజయదశమి సందర్భంగా విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ చిత్రం ఎన్ బి కె థియేటర్ లో శ్రేయాస్ ఈటి ద్వారా అక్టోబర్ 24న  విడుదలవుతుంది. 

ఈ చిత్రం ద్వారా వసూలైన మొత్తంలో కొంత భాగం చారిటీస్ కి ఉపయోగించడానికి నందమూరి బాలకృష్ణ సంకల్పించారు. ఎన్నాళ్ళగానో నర్తనశాల కోసం రూపొందించిన సన్నివేశాలను చూడాలన్న కోరిక ఈ నెల 24 నుండి నెరవేరబోతోంది. ఇది వార్త నందమూరి అభిమానులలో ఫుల్ జోష్ నింపింది. 

PREV
click me!

Recommended Stories

Illu Illalu Pillalu Today Episode Jan 17 అమూల్య నిశ్చితార్థం ఆపేందుకు భారీ ప్లాన్ వేసి శ్రీవల్లి, భాగ్యం.. కానీ
Thanuja: సీరియల్స్ కి తనూజ గుడ్‌ బై.. ఇకపై ఆమె టార్గెట్‌ ఇదే.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 కి వెళ్లిన కారణం ఇదేనా