
నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం "వీరసింహారెడ్డి". సంక్రాంతి కానుకగా ఈ నెల 12వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రం విడుదలైన నాలుగు రోజుల్లో రూ.104 కోట్ల మేరకు వసూళ్లను రాబట్టిందని నిర్మాతలు ప్రకటించారు. అందుకు కారణంగా ఇందులో కథాకథనాలు బలంగా ఉండటమే కారణంగా చెప్పొచ్చు. దానితో పాటు సంగీతం, కొరియోగ్రఫీ, ఫోటోగ్రఫీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఏరియావైజ్ బిజినెస్ ఎంతైంది..ఎక్కడ బ్రేక్ ఈవెన్ వచ్చిందో చూద్దాం.
👉నైజాం: 15 - 15.37 ✅
👉సీడెడ్: 13 - 15.03✅
👉ఉత్తరాంధ్ర : 9 - 6.41
👉ఈస్ట్ గోదావరి: 5.2 - 4.94
👉వెస్ట్ గోదావరి: 5 - 3.76
👉గుంటూరు: 6.40 - 5.97
👉కృష్ణా : 5 - 4.24
👉నెల్లూరు : 2.7 - 2.59
ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రల్లోనే కాకుండా విదేశాల్లోనూ తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ముఖ్యంగా అమెరికాలో ఈ సినిమాలకు అభిమానులు పోటెత్తుతున్నారు. యూఎస్ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురుస్తోంది. ఈ చిత్రం మిలియన్ డాలర్ల దిశగా దూసుకెళ్తోంది.
మరో ప్రక్క బాలయ్య 'అన్ స్టాపబుల్ 2' వేదికపై 'వీరసింహా రెడ్డి' టీమ్ సందడి చేసింది. బాలయ్య...గోపీచంద్ మలినేని పడిన స్ట్రగుల్స్ గురించి అడిగారు. అందుకు గోపీచంద్ మలినేని స్పందిస్తూ .. 'క్రాక్' సినిమాకి ముందు రెండేళ్ల పాటు చాలా కష్టాలు పడ్డాను. నాకున్న కొద్ది పాటి ఆస్తులను కూడా అమ్మేశాను. ఆ సమయంలో మన శ్రేయోభిలాషులెవరు? అనే విషయం నాకు అర్థమైంది" అని అన్నారు.
"ఇండస్ట్రీలో నిలబడాలంటే సక్సెస్ ఉండాలి .. అది లేకపోతే ఎవరూ మనవెంట ఉండరు. అందువల్లనే సక్సెస్ ఎంత ముఖ్యమైనదనేది తెలుసుకున్నాను. అప్పటి నుంచి మరింత హార్డ్ వర్క్ చేయడం మొదలు పెట్టాను. ఇకపై అలాంటి కష్టాలు రావని నేను అనుకుంటున్నాను .. ఎందుకంటే ఇప్పుడు నేను సక్సెస్ అయ్యాను" అంటూ ఎమోషనల్ అయ్యారు.