నేను గట్టిగా తొడ గొడితే ఆ సౌండుకే చస్తావురా అంటున్న బాలయ్య

Published : Jan 13, 2017, 05:47 AM ISTUpdated : Mar 25, 2018, 11:41 PM IST
నేను గట్టిగా తొడ గొడితే ఆ సౌండుకే చస్తావురా అంటున్న బాలయ్య

సారాంశం

శాతకర్ణిలో రెండు తొడలు కొట్టిన బాలయ్య డైలాగ్ డెలివరీలో బాలయ్య తనకు తానే సాటి శాతకర్ణిలో తనదైన డైలాగ్ డెలివరీతో రౌద్ర రసం పండించిన నటసింహం

తెలుగు సినీ హీరోల్లో నందమూరి బాలకృష్ణది ప్రత్యేక స్థానం. తన డైలాగ్ డెలివరీతో... తొడ గొట్టి మీసం మెలేయడంతో... తనకు సాటి లేదని నిరూపించుకున్నాడు బాలయ్య. బాలకృష్ణ సినిమా అంటేనే.. మాస్ ని మెస్మరైజ్ చేసే డైలాగులు. మరి అలాంటి డైలాగ్ చక్రవర్తికి  ఓ చక్రవర్తి పాత్ర ఇస్తే ఊరుకుంటాడా.. బాలకృష్ణ తాజా చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణిలో అదే నిరూపించాడు నందమూరి నటసింహం. 

సరైన పాత్ర దొరికితే బాలయ్య సింహగర్జన ఎలా ఉంటుందో గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రం ద్వారా మరోసారి నిరూపించాడు . ఇక తొడ కొట్టాలన్నా , విలన్ ని పడగొట్టాలన్నా బాలయ్యే అన్న నానుడి మరోసారి రుజువు చేసాడు శాతకర్ణి చిత్రంతో . ఈ చిత్రంలో ఏకంగా రెండుసార్లు తొడ కొట్టి సంచలనం సృష్టించాడు .

విశ్రాంతి కి ముందు ఒకసారి తొడకొట్టి సంచలనం రేపిన బాలయ్య క్లైమాక్స్ లో కూడా మరోసారి తొడ కొట్టడం విశేషం . ఇక దీని స్పెషల్ ఏంటంటే ....... ఈసారి బాలయ్య ఒక్క తొడ కొట్టడం కాదు ఏకంగా రెండు తొడలను కొట్టి చరిత్ర కారుడి చిత్రమైనా బాలయ్య పాత్ర పోషిస్తే మరో లెవల్లో ఉంటుందని నిరూపించాడు . మొత్తానికి నిన్న రిలీజ్ అయిన గౌతమిపుత్ర శాతకర్ణి సంచలన విజయం దిశగా దూసుకు పోతోంది .

PREV
click me!

Recommended Stories

Kajal Aggarwal: బాత్‌ రూమ్‌ని కూడా వదలని కాజల్‌.. బ్లాక్‌ డ్రెస్‌లో ఇలా చూస్తే ఇక అంతే
kalyan padala love story: నా కంటే వాడు బెటర్‌గా ఉన్నాడని వెళ్లిపోయింది.. కళ్యాణ్‌ క్రేజీ లవ్‌ స్టోరీ, ఎంత మోసం చేసింది