బాలయ్య గ్రేట్...చనిపోయిన ఆ ఇద్దరు నటులను ఫ్యాన్స్ కి దగ్గిర చేశారు

By team teluguFirst Published Oct 21, 2020, 5:00 PM IST
Highlights

ఎప్పుడో ఆగిపోయిన నర్తనశాల చిత్రాన్ని బాలయ్య చాలా కాలం తరువాత తెరపైకి రావడం జరిగింది. ఈ మూవీలోని కొన్ని సన్నివేశాలు శ్రేయాస్ ఈటీ ద్వారా విడుదల చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. ఐతే ఈ మూవీ ద్వారా బాలయ్య ఇద్దరు   దివంగత నటులను పరిచయం చేసినట్లు అయ్యింది.

నటసింహం బాలయ్యకు 16ఏళ్లుగా రాని ఆలోచన ఇప్పుడు వచ్చింది. 2004లో మధ్యలో ఆగిపోయిన నర్తనశాల అనే పౌరాణిక చిత్రాన్ని మరలా ఆయన తెరపైకి తెచ్చారు. ఆ చిత్రం కోసం చిత్రీకరించిన సన్నివేశాలు ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. బాలయ్య తన డ్రీం ప్రాజెక్ట్ గా నర్తనశాల మూవీ షూటింగ్ ప్రారంభించారు. 2003లో ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళింది. నర్తనశాల మూవీలో కీలకమైన ద్రౌపది పాత్ర చేసిన సౌందర్య విమాన ప్రమాదంలో మరణించడం జరిగింది. 

సెంటిమెంట్స్ ని బలంగా నమ్మే బాలయ్య సౌందర్య మరణం కారణంగా నర్తనశాల మూవీ మధ్యలో ఆపివేశాడు. నర్తనశాల చిత్రానికి బాలకృష్ణ దర్శక నిర్మాతగా ఉన్నారు. అయినా అనుకోని అవరోధాల వలన ఆ మూవీ కార్యరూపం దాల్చలేదు. కాగా దసరా కానుకగా నర్తనశాల మూవీలోని కొన్ని సన్నివేశాలు బాలయ్య విడుదల చేయనున్నట్లు ప్రకటించడం జరిగింది. ఎన్బీకే థియేటర్ ద్వారా శ్రేయాస్ ఈటీలో నర్శనశాల మూవీకి సంబంధించిన సన్నివేశాలు విడుదల కానున్నాయి. 

దీనితో ఈ చిత్రంలో నటించిన ఇద్దరు దివంత నటులను బాలయ్య వారి ఫ్యాన్స్ కి పరిచయం చేసినట్లు అయ్యింది . తెలుగులో లేడీ  సూపర్ స్టార్ గా పేరుగాంచిన సౌందర్యను వెండితెరపై చూసి చాలా కాలం అవుతుంది. ఆమె మరణించిన 16ఏళ్ల తరువాత సౌందర్యను ఆమె ఫ్యాన్స్ గొప్పదైన ద్రౌపది పాత్రలో చూడనున్నారు. 

రియల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న శ్రీహరి కూడా అకాల మరణం పొందారు. ఓ హిందీ మూవీ షూటింగ్ కోసం ముంబై వెళ్లిన శ్రీహరి అనారోగ్యంతో లీలావతి హాస్పిటల్ నందు మరణించడం జరిగింది. ఆయన కూడా వెండితెరపై కనిపించి ఏడేళ్లు అవుతుంది. ఈ ఈ ఇద్దరు గొప్ప నటులను బాలయ్య తన నర్తనశాల చిత్రం ద్వారా మరలా ప్రేక్షకులకు తెరపై చూపించనున్నాడు. బాలయ్య నర్తనశాలలో సౌందర్య ద్రౌపదిగా, శ్రీహరి భీముడు పాత్ర చేశారు.

click me!