బాలయ్య ముందున్నాడు.. చిరు వెనుక ఉన్నాడు..

Published : Nov 10, 2016, 01:44 PM ISTUpdated : Mar 24, 2018, 12:15 PM IST
బాలయ్య ముందున్నాడు.. చిరు వెనుక ఉన్నాడు..

సారాంశం

వచ్చే సంక్రాంతి రిలీజ్ కాబోయే సినిమాల్లో మెగాస్టార్, నటసింహం ఇద్దరూ పోటీ పడుతున్నారు. బాలయ్య గౌతమిపుత్ర శాతకర్ణి, మెగా స్టార్ ఖైదీ నెంబర్ 150 సినిమాలతో ఈ సంక్రాంతికి రేసుగుర్రాల్లో మిగిలారు. కాగా ప్రతీ సంక్రాంతికి పందెంకోళ్లుగా నిలిచే ఆ నలుగురిలో ఇద్దరే మిగలడంతో ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే నాగార్జున బరిలోంచి తప్పుకోగా... వెంకీ సైతం గురు రిలీజ్  వాయిదా వేసుకునే ప్లాన్ వేశారు. మరి మెగాస్టార్, బాలయ్య చిత్రాలు సంక్రాంతి బరిలో నిలుస్తాయా...

సంక్రాంతి బాక్సాఫీస్ కి ప్రిపేర్ కావడంలో ప్రస్తుతానికి బాలయ్య ముందున్నాడు. 2017 సంక్రాంతికి తన సినిమాను రిలీజ్ చేసే పని పెట్టుకున్నాడు. బాలయ్య అందుకు తగ్గట్లే జోరు చూపిస్తున్నాడు. ఇప్పటికే టీజర్ రిలీజ్ చేసాడు. చాలా ఏరియాల్లో సినిమా భారీ మొత్తంలో అమ్ముడుపోయింది కూడా.. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం అనుకున్న సమయానికంటే ముందే షూటింగ్ పూర్తి చేసుకునే అవకాశముందంట. సినిమాకు కీలకంగా భావిస్తున్న గ్రాఫిక్స్ వర్క్ కూడా మరో వైపు శరవేగంగా జరుగుతుందంట. సో... సంక్రాంతికి బాలయ్య సినిమా రిలీజ్ కన్ఫమ్.

 

ఇక బాలయ్యతో సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరు పోటీ పడుతున్నారు. తన 150వ చిత్రాన్ని శాతకర్ణికి పోటీగా బరిలోకి దింపుతున్నాడు.  అయితే ఇంతవరకు సినిమాకు సంబంధించిన టీజర్ కూడా విడుదల చేయకపోవడం ...కేవలం ఫస్ట్ లుక్ పోస్టర్ కే పరిమితం కావడంతో..  అభిమానుల్లో కూడా కాస్త్ జోష్ తగ్గింది. ఒక సారి ఖైధీ నెంబర్ 150 సినిమాకు సంబంధించిన టీజర్ విడుదలైతే.. చిరు వేసే స్టెప్పులను చూపిస్తే.. యూట్యూబ్ షేక్ కావడం ఖాయం అంటున్నారు మెగా అభిమానులు. మెగాస్టార్ సినిమాకు సంబంధించిన ప్రీరిలీజ్ బిజినెస్ కూడా జోరుగా సాగుతోంది.

          అలా బాలయ్య షూటింగ్ శరవేగంగా జరుపుకొంటూ రిలీజ్ అయ్యేందుకు జెట్ స్పీడ్ లో దూసుకెళ్తోంది. అయితే మెగా స్టార్ చిరు ఖైదీ నెంబర్ 150 షూటింగ్ మాత్రం ఇంకా కొన సా...గుతూనే ఉంది. సంక్రాంతికల్లా రిలీజ్ అవుతుందా లేదా అనే లెవల్లో మెగా స్టార్ మూవీ టాక్ క్రియేట్ చేస్తోంది. తొమ్మిదేళ్ల గ్యాప్ తర్వాత చిరు రీ ఎంట్రీ ఇస్తున్న చిత్రం కావడంతో అన్ని అంశాల పట్ల మెగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీంతో కొంత ఆలస్యమవుతున్నట్లు కనిపిస్తోంది.  ఏదేమైనా వచ్చే సంక్రాంతికి బాలయ్య, చిరు నువ్వా నేనా అని ఒకరిపై ఒకరు కాలు దువ్వుతన్నారు.

PREV
click me!

Recommended Stories

Jr Ntr కి రెండో సారి హ్యాండిచ్చిన త్రివిక్రమ్‌.. తారక్‌కే ఎందుకిలా జరుగుతుంది?
తెలుగులో నా ఫేవరెట్ హీరో అతడే.. ఒక్కసారైనా కలిసి నటించాలి.. క్రేజీ హీరోయిన్ కామెంట్స్