శ్రీకాంత్ అడ్డాలతో అఖిల్ అక్కినేని సినిమా.. సాహసం చేస్తున్నాడా..?

Published : Aug 27, 2023, 12:11 PM IST
శ్రీకాంత్ అడ్డాలతో అఖిల్ అక్కినేని సినిమా.. సాహసం చేస్తున్నాడా..?

సారాంశం

సక్సెస్ కోసం ఎన్నో ఏళ్ళ నుంచి ఎదరు చూస్తున్నాడు అక్కినేని వారసుడు అఖిల్. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆయనకు సాలిడ్ హిట్ దగ్గడం లేదు. హీరోమెటీరియల్ అని నిరూపించుకున్నా.. ఇండస్ట్రీలో నిలబడలేకపోతున్నాడు అఖిల్. ఇక తాజాగా ఆయన ఓ సాహసం చేయబోతున్నాడట.   

సక్సెస్ కోసం ఎన్నో ఏళ్ళ నుంచి ఎదరు చూస్తున్నాడు అక్కినేని వారసుడు అఖిల్. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆయనకు సాలిడ్ హిట్ దగ్గడం లేదు. హీరోమెటీరియల్ అని నిరూపించుకున్నా.. ఇండస్ట్రీలో నిలబడలేకపోతున్నాడు అఖిల్. ఇక తాజాగా ఆయన ఓ సాహసం చేయబోతున్నాడట. 

అక్కినేని వారసుడిగా అఖిల్ టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఎనిమిదేళ్లకు పైనే అయ్యింది. కాని ఇప్పటి వరకు కమర్షియల్‌ సక్సెస్‌ ను మాత్రం సాధించలేకపోయాడు అక్కినేని అఖిల్‌. మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌తో హిట్టు దక్కినా.. ఆ సినిమాతో కూడా  కమర్షియల్‌గా సక్సెస్ కాలేకపోయాడు. . దాంతో రెండేళ్లు గ్యాప్‌ తీసుకుని ఏజెంట్‌ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఈసినిమా కోసం చాలా కష్టపడ్డాడు అఖిల్. సిక్స్ ప్యాక్ ను రెండు మూడేళ్లు అలాగే మెయిటేన్ చేయడం అంటే అంత ఈజీ టాక్స్ కాదు. అంతే కాదు నటనలో.. బాడీ లాంగ్వేజ్ లో కొత్త దనంతో పాటు.. ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ లతో అదరగొట్టాడు. కాని ఏం లాభం. భారీ అంచనాల నడుమ.. స్టార్ కాస్ట్ తో తెరకెక్కిన ఈసినిమా డిజాస్టర్‌ టాక్‌ తెచ్చుకుని బాక్సాఫీస్‌ దగ్గర తేలిపోయింది. 

కథలో కొత్త దనం లేకపోవడం.. పాత కథలతోనే కొత్త ప్రాడక్ట్ ను తీసుకురావడంతో.. సురేందర్‌ రెడ్డికి కూడా ఈ సినిమా పెద్ద దెబ్బఅయ్యింది. . అక్కినేని అభిమానులను సైతం ఈ సినిమా తీవ్రంగా నిరాశపరిచింది. రెండేళ్లు తీవ్రంగా శ్రమించిన  అఖిల్‌ను ఈ సినిమా ఫలితం తీవ్రంగా నిరాశపరిచింది. దాంతో ఈసారి సారి ఎలాగైనా సాలిడ్‌ కంబ్యాక్‌ ఇచ్చి తనను తాను నిరూపించుకోవాలి అనకున్నాడు అఖిల్. కాని అది నిరాశే అయ్యింది. ఇక అఖిల్ నెక్ట్స్ సినిమాకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

అఖిల్ తన నెక్ట్స్ సినిమాను  శ్రీకాంత్‌ అడ్డాల డైరెక్షన్ లో చేయబోతున్నట్టు  తెలుస్తుంది. రీసెంట్ గా శ్రీకాంత్  అఖిల్‌కు ఓ మాస్‌ కథను చెప్పగా అఖిల్‌కు ఆకథ బాగా నచ్చిందట.. ఇక  వెంటనే గ్రీన్‌ సిగ్నల్‌ కూడా  ఇచ్చాడట. ఎలాగో నారప్పతో సెన్సిబుల్‌ దర్శకుడిగా పేరున్న శ్రీకాంత్‌ అడ్డాల మాస్‌ సబ్జెక్ట్‌ను కూడా డీల్‌ చేయడంలోనూ దిట్ట అని నిరూపించాడు. ఇక ఇప్పుడు పెద్ద కాపు అనే ఓ మాస్‌ కమర్షియల్‌ సినిమా తీస్తున్నాడు.ఇప్పటికే పెద్ద కాపు నుంచి రిలీజైన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌, గ్లింప్స్‌ ఓ రేంజ్‌లో అంచనాలు నెలకొల్పాయి. ఇక ఇప్పుడు అఖిల్‌తో కూడా అలాంటి ఓ మాస్‌ సినిమానే ప్లాన్‌ చేస్తున్నాడట. 

అన్నీ కుదిరితే ఇదే ఏడాది చివర్లో సినిమా పట్టాలెక్కే చాన్స్‌ ఉంది. ఇక అఖిల్ యూవీ క్రియేషన్స్‌లో కూడా ఓ సినిమాకు కమిట్‌ అయ్యాడు. ఇప్పటికే స్క్రిప్ట్‌ కూడా ఫైనల్‌ అయిపోయిందని ఇన్‌సైడ్‌ టాక్‌. సాహో సినిమాకు ఆసోసియేట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన అనిల్‌ కుమార్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. వీలైనంత త్వరగా ప్రీ ప్రొడక్షన్‌ పనులను పూర్తి చేసి షూటింగ్‌ను ప్రారంభించాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తుంది. ఈ సినిమాలో అఖిల్‌కు జోడీగా జాన్వీ కపూర్‌ నటించనున్నట్లు తెలుస్తుంది. మరి ముందుగా ఏ సినిమా పట్టాలెక్కుతుందో చూడాలి.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: తనూజకి షాక్‌.. కళ్యాణ్‌ సీక్రెట్‌ క్రష్‌ బయటపెట్టిన ఇమ్మాన్యుయెల్‌
Dhurandhar Collections: బాక్సాఫీసు వద్ద `ధురంధర్‌` కలెక్షన్ల సునామీ.. తెలుగు ఆడియెన్స్ కి గుడ్‌ న్యూస్‌