మోక్షజ్ఞ, బ్రాహ్మణి తేజస్వినిలతో బాలకృష్ణ.. అరుదైన ఫోటో వైరల్‌

Published : Nov 14, 2020, 07:01 PM ISTUpdated : Nov 14, 2020, 11:17 PM IST
మోక్షజ్ఞ,  బ్రాహ్మణి తేజస్వినిలతో బాలకృష్ణ.. అరుదైన ఫోటో వైరల్‌

సారాంశం

బాలకృష్ణ తాజాగా ఓ అరుదైన ఫోటోని అభిమానులతో పంచుకున్నారు. ఇందులో తాను తన ముగ్గురు పిల్లలు మోక్షజ్ఞ, తేజస్విని, బ్రహ్మణిలతో కలిసి ఉన్నాడు. అయితే తన పిల్లలతో తాను ఉండటంలో విశేషం ఏం లేదు. కానీ తాజాగా ఫోటోలో కనిపిస్తున్నట్టు ఉన్న లుక్కే విశేషంగా మార్చింది. 

దీపావళి స్పెషల్‌గా బసవతారకం ఆసుపత్రిలో అంబులెన్స్ సేవలు ప్రారంభించిన బాలకృష్ణ తాజాగా ఓ అరుదైన ఫోటోని అభిమానులతో పంచుకున్నారు. ఇందులో తాను తన ముగ్గురు పిల్లలు మోక్షజ్ఞ, తేజస్విని, బ్రహ్మణిలతో కలిసి ఉన్నాడు. అయితే తన పిల్లలతో తాను ఉండటంలో విశేషం ఏం లేదు. కానీ తాజాగా ఫోటోలో కనిపిస్తున్నట్టు ఉన్న లుక్కే విశేషంగా మార్చింది. 

ఇందులో బెడ్‌పై బాలకృష్ణ పడుకోగా, ఆయనపై ముగ్గురు పిల్లలున్నారు. మోక్షజ్ఞ ఫస్ట్ ఉండగా, ఆ తర్వాత బ్రాహ్మణి, తేజస్విని బాలకృష్ణపై కూర్చోవడం విశేషంగా చెప్పొచ్చు. చిన్ననాటి ఈ ఫోటో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ముఖ్యంగా బాలయ్య అభిమానులు ఎంజాయ్‌ చేస్తున్నారు. తమ అభిమాన నటుడిని, వారి పిల్లలను చిన్నప్పుడు ఇలా చూసి ఆశ్చర్యానికి, ఆనందానికి గురవుతున్నారు. 

బ్రాహ్మణి ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్‌ని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక మోక్షజ్ఞ నటనా ఎంట్రీ కోసం ప్లాన్‌ జరుగుతుంది. గత మూడేళ్లుగా మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారని వార్తలు వస్తున్నాయి. కానీ దీనిపై ఇంకా క్లారిటీ లేదు. ఇక బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఇది షూటింగ్‌ జరుపుకుంటోంది.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Suman Shetty Eliminate: సుమన్‌ శెట్టి ఎలిమినేట్‌.. భరణితో స్నేహం దెబ్బ కొట్టిందా? తనూజ ఆవేదన
Ustaad Bhagat Singh: ఊపేసేలా ఉన్న `దేఖ్‌ లేంగే సాలా` పాట.. మళ్లీ ఆ రోజులను గుర్తు చేసిన పవన్‌ కళ్యాణ్‌