బాలయ్య చేసిన పనికి నందమూరి అభిమానుల్లో చీలికలు? 

Published : Mar 03, 2023, 05:52 PM IST
బాలయ్య చేసిన పనికి నందమూరి అభిమానుల్లో చీలికలు? 

సారాంశం

బాలయ్య అబ్బాయ్ ఎన్టీఆర్ ని అవమానించాడని సోషల్ మీడియా కోడై కూస్తుంది. అభిమానులు బాలయ్యను సమర్థించే ప్రయత్నం చేస్తున్నా గొడవ పెద్దదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.


ఎన్టీఆర్ మొదటి నుండి నందమూరి ఫ్యామిలీ నిరాధారణకు గురవుతున్నాడనే వాదన ఉంది. అటు రాజకీయంగా కూడా హరికృష్ణ ఫ్యామిలీ ఒకవైపు నారా ఫ్యామిలీ మరొక వైపు అన్నట్లు సాగాయి. ఒక దశ వచ్చాక టీడీపీలో హరికృష్ణకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదు. 2009 ఎన్నికల్లో అప్పటి పరిస్థితుల రీత్యా ఎన్టీఆర్ సహకారం బాబు, బాలయ్య తీసుకున్నారు. అప్పటికే టాప్ స్టార్ గా ఎదిగిన ఎన్టీఆర్ తో టీడీపీ పార్టీకి ప్రచారం చేయించుకున్నారు. 

ఆ ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలైంది. ఆ తర్వాత ఎన్టీఆర్ మళ్ళీ టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినా ఎన్టీఆర్ ని దరిచేరనీయలేదు. 2019 ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత ఎన్టీఆర్ వర్గం ఒకటి టీడీపీ పార్టీలో ఏర్పడింది. ఎన్టీఆర్ మాత్రమే టీడీపీని కాపాడగలడు అనే డిమాండ్ ఊపందుకుంది. ఇది బాలయ్యకు ఏమాత్రం నచ్చడం లేదు. ఆ మధ్య ఎన్టీఆర్ టీడీపీలో రావడంపై మీ స్పందన ఏంటని అడిగితే... అది తనకు ఇష్టం లేదన్నట్లు చెప్పాడు. ఎన్టీఆర్ వస్తే ప్లస్ కాదు, పైగా మైనస్ అవుతుందన్నారు. 

ఎన్టీఆర్ అంటే బాలయ్యకు గిట్టదు అనేది ప్రచారంలో ఉన్న వాదన. దీనికి బలం చేరకూర్చేలా తాజాగా ఓ సంఘటన చోటు చేసుకుంది. తారకరత్న పెదకర్మకు హాజరైన ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లను బాలయ్య కనీసం పలకరించలేదు. ఆయన వస్తున్నారని లేచి నిల్చున్న ఎన్టీఆర్ ని బాలకృష్ణ పట్టించుకోలేదు. ఎన్టీఆర్ పక్కన ఉన్న వాళ్ళను మాత్రం పలకరించి అక్కడ నుండి వెళ్లిపోయారు. తారకరత్న పెదకర్మ కార్యక్రమంలో బాలకృష్ణ ఎన్టీఆర్ ని అవమానించాడనే వాదన మొదలైంది. 

బాలయ్య అలా చేయలేదని ఫ్యాన్స్ కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ వీడియోలో మాత్రం బాలయ్య పట్టించుకోకపోవడం, ఎన్టీఆర్ అసహనంగా ముఖం పెట్టడం కనిపించాయి. నందమూరి ఫ్యాన్స్ లోని ఎన్టీఆర్ వర్గం కూడా ఒకింత అసహనం వ్యక్తం చేస్తున్నారు. యాంటీ ఫ్యాన్స్ మాత్రం ట్రోల్ చేస్తున్నారు. బాలయ్య చర్య నందమూరి అభిమానులకు తలనొప్పి తెచ్చిపెట్టింది. బాలయ్య-ఎన్టీఆర్ మధ్య రిలేషన్స్ సరిగా లేవన్న విషయం రుజువైంది. ఈ పరిణామం నందమూరి అభిమానుల్లో తుఫానుకు కారణమైంది.  
 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: తనూజకి షాక్‌.. కళ్యాణ్‌ సీక్రెట్‌ క్రష్‌ బయటపెట్టిన ఇమ్మాన్యుయెల్‌
Dhurandhar Collections: బాక్సాఫీసు వద్ద `ధురంధర్‌` కలెక్షన్ల సునామీ.. తెలుగు ఆడియెన్స్ కి గుడ్‌ న్యూస్‌