ఎన్టీఆర్‌ యుగపురుషుడు.. ఆయనపై పుస్తకం రావాలిః తండ్రికి బాలకృష్ణ నివాళి

Published : May 28, 2021, 09:00 AM ISTUpdated : May 28, 2021, 09:04 AM IST
ఎన్టీఆర్‌ యుగపురుషుడు.. ఆయనపై పుస్తకం రావాలిః తండ్రికి బాలకృష్ణ నివాళి

సారాంశం

నేడు(మే28) శుక్రవారం ఎన్టీఆర్‌ 98వ జయంతి. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌కి నివాళ్లు అర్పించారు.  తండ్రి ఎన్టీఆర్‌ని గుర్తు చేసుకున్నారు బాలకృష్ణ. 

నేడు(మే28) శుక్రవారం ఎన్టీఆర్‌ 98వ జయంతి. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌కి నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా తండ్రి ఎన్టీఆర్‌ని గుర్తు చేసుకున్నారు బాలకృష్ణ. ఎన్టీఆర్‌ యుగపురుషుడని కొనియాడారు. ఆయన జీవితంలో పుస్తకం రావాలన్నారు. నాన్న ఇచ్చిన స్ఫూర్తే తనని నడిపిస్తుందన్నారు. ఈ సందర్బంగా ఏపీలో కరోనాకి ఆనందయ్య మందు వివాదాంపై ఆయన స్పందించారు. ఆనందయ్య మందుపై తనకు నమ్మకం ఉందని తెలిపారు.

ఇదిలా ఉంటే కరోనా మహమ్మారి విజృంభన దృష్ట్యా  అభిమానుల క్షేమం ముఖ్యమని భావించి ఈ సారి  ఎన్టీఆర్‌ ఘాట్‌ని సందర్శించడం లేదని ఎన్టీఆర్‌ తనయుడు, నిర్మాత నందమూరి రామకృష్ణ తెలిపిన విషయం తెలిసిందే. బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా బాలకృష్ణ ఆలపించిన `శ్రీరామదండకం` పాట వీడియోని కాసేపట్లో విడుదల చేయబోతున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం బాలకృష్ణ `అఖండ` చిత్రంలో నటిస్తున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. ప్రగ్యా జైశ్వాల్‌ కథానాయికగా నటిస్తుంది. శ్రీకాంత్‌ విలన్‌ అని టాక్‌.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Chiranjeevi: ఒకవైపు తమ్ముడు, మరోవైపు కొడుకు.. అస్సలు కుదరదు అని బాంబు పేల్చిన చిరంజీవి
చూడ్డానికి విలన్ లా ఉన్నాడే, ఈయన హీరోనా ? చిరంజీవి ని అంత మాట అన్న హీరోయిన్ ఎవరో తెలుసా?