Balakrishna: మద్యం మీద బాలయ్య బాబు పద్యం.. వైరల్ అవుతున్న వీడియో

By Mahesh JujjuriFirst Published Jan 16, 2022, 5:27 PM IST
Highlights

నందమూరి బాలకృష్ణ(Balakrishna) దూసుకుపోతున్నారు. యంగ్ హీరోలతో పోటీ పడుతూ సై అంటున్నారు. ఏజ్ పెరుగుతున్నా కొద్ది ఎనర్జీ కూడా పెరుగుతుంది స్టార్ హీరోకి. వరుస ప్రాజెక్ట్స్ పట్టాలు ఎక్కిండంతో పాటు బుల్లి తెరపై కూడా సక్సెపుల్ గా అన్ స్టాపబుల్ షోను రన్ చేస్తున్నారు. స్టార్.. సూపర్ స్టార్ గెస్ట్ లతో ఓ ఆట ఆడుకుంటూ.. ఆడిస్తూ.. బాలయ్య షోను సూపర్ సక్సెస్ చేసేస్తున్నారు.

నందమూరి బాలకృష్ణ(Balakrishna) దూసుకుపోతున్నారు. యంగ్ హీరోలతో పోటీ పడుతూ సై అంటున్నారు. ఏజ్ పెరుగుతున్నా కొద్ది ఎనర్జీ కూడా పెరుగుతుంది స్టార్ హీరోకి. వరుస ప్రాజెక్ట్స్ పట్టాలు ఎక్కించడంతో పాటు బుల్లి తెరపై కూడా సక్సెపుల్ గా అన్ స్టాపబుల్ షోను రన్ చేస్తున్నారు. స్టార్.. సూపర్ స్టార్ గెస్ట్ లతో ఓ ఆట ఆడుకుంటూ.. ఆడిస్తూ.. బాలయ్య షోను సూపర్ సక్సెస్ చేసేస్తున్నారు.

ఇఫ్పటి వరకూ బాలకృష్ణ (Balakrishna) అన్ స్టాపబుల్ షో(Unstoppable )కు చాల మంది గెస్ట్ లు వచ్చారు. మంచు ఫ్యామిలీతో స్టార్ట్ చేసి.. నానీ, అఖండా టీమ్, రాజమౌళి, పుష్ప టీమ్, రవితేజ,మహేష్ బాబు, రానా, ఇలా స్టార్స్ అందరినీ ఇంటర్వ్యూ చేసుకుంటూ వస్తున్న బాలయ్యబాబు.. అందరితో తనదైన మార్క్ స్టైల్ కామెడీతో... ప్రశ్నలతో.. అలరిస్తూ.. ఆడియన్స్ ఆకట్టుకుంటున్నారు. వెండితెరపైనే కాదు.. బుల్లి తెరపై కూడా సింహం సింహమే అన్నట్టు దూసుకుపోతున్నరు బాలయ్య.

 

ఇక సంక్రాంతికి లైగర్ టీమ్ తో  Unstoppable అనిపించాడు బాలయ్య.లైగర్ టీమ్ తో అన్ స్టాపబుల్ ఎంటర్ టైన్మెంట్ ను చూపించాడు. లైగర్ టీమ్ నుంచి యంగ్ స్టార్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) తో పాటు స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, ఛార్మీ కూడా ఈ షోలో సందడి చేశారు. ఈ ముగ్గురిని ఫన్నీ అండ్ ప్రోఫెషనల్ క్యశ్చన్స్ తో హడలెత్తించాడు బాలయ్య. సరదా సరదా లుక్ తో సందడి చేశాడు. ఇక ఈ సందర్భంగా బాలయ్య బాబు డైరెకటర్ పూరీ జగన్నాథ్ కోరికమేరకు.. తాను మద్యం తాగేప్పుడు పాడే పద్యాన్ని గుక్క తిప్పుకోకుండా పాడి వినిపించాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.


కనుమ పండుగ శుభాకాంక్షలు pic.twitter.com/kKBVltSnjT

— మాయాబజార్ 📣 (@rsloya3969)

 

బాలయ్య బాబు సంక్రాంతి లుక్ లో పట్టు పంచెలో కనిపించగా.. విజయ్ దేవరకొండ స్టైలిష్ లుక్ లో మెరిసిపోతున్నారు. బాలయ్య ఎనర్జీకి.. విజయ్ దేవరకొండ క్రేజ్ తో.. ఈ ఎపిసోడ్ సూపర్ సక్సెస్ అయ్యింది. అంతే కాదు విజయ్ దేవకొండతో స్టేజ్ మీద బాలయ్య బాక్సింగ్ చేసి చూపించాడు. ఆరు పదుల వయస్సులో కూడా బాలయ్యఎనర్జీకి విజయ్ దేవరకొండ సైతం ఫిదా అయిపోయాడు. బాలయ్య అంటే ఎంతో ఇష్టమున్న పూరి జగన్నాథ్.. ఈ ఎపిసోడ్ లో ప్రతీ మూమెంట్ ను ఎంజాయ్ చేశాడు.

ఇటు బాలయ్య అన్ స్టాపబుల్ షోతో అదరగొడుతున్నారు. అఖండ హిట్ జోష్ లో ఉన్న బాలయ్య రెమ్యూనరేషన్ కూడా పెంచారట. ప్రస్తుతం మలినేని గోపీచంద్ తో యాక్షన్ మూవీ చేస్తున్న బాలకృష్ణ ఆతరువాత అనిల్ రావిపూడితో మూవీ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కారంచేడులో అక్క పురధేశ్వరి ఇంట్లో.. ఫ్యామిలీతో సహా.. సంక్రాంతి సంబరాల్లో మునిగిపోయాడు బాలయ్య బాబు.

 

click me!