ఎన్టీఆర్ ఎఫెక్ట్.. సినిమాలకు బాలయ్య బ్రేక్..?

Published : Mar 02, 2019, 03:38 PM IST
ఎన్టీఆర్ ఎఫెక్ట్.. సినిమాలకు బాలయ్య బ్రేక్..?

సారాంశం

హీరోగా వంద సినిమాలకు పైగా సినిమాలు చేసిన బాలకృష్ణ తన కెరీర్ లో సినిమా నిర్మాణంపై దృష్టి పెట్టలేదు. గతంలో నిర్మాతగా సినిమాలు చేయాలనుకున్నప్పటికీ కుదరలేదు. ఎట్టకేలకు తన తండ్రి బయోపిక్ తో నిర్మాతగా మారాడు బాలకృష్ణ.

ప్రీరిలీజ్ బిజినెస్ డెబ్బై కోట్ల వరకు జరగంతో సినిమా ఓ రేంజ్ లో కలెక్షన్స్ వసూలు చేస్తుందని అనుకున్నారు. కానీ ఈ సినిమాకి కనీసం ఏవరేజ్ టాక్ కూడా రాలేదు. లాభాల సంగతి పక్కన పడితే కనీసపు వసూళ్లు లేక బయ్యర్లు బోరుమంటున్నారు. ఈ క్రమంలో బాలయ్య తన బ్యానర్ పై సినిమాలు చేసే ఆలోచనను పక్కన పెట్టినట్లు సమాచారం. 

బాలయ్య-బోయపాటి శ్రీను కాంబినేషన్ లో చేయాలనుకున్న సినిమాను మొదట బాలయ్య ఎన్బీకే ఫిలిమ్స్ బ్యానర్ పై తీయాలనుకున్నాడు. కానీ ఇప్పుడు ఈ సినిమా కోసం నిర్మాతను వెతికే పనిలో పడ్డారు. 

నిర్మాతగా తొలి సినిమా దెబ్బ కొట్టడంతో బాలయ్య ఇప్పట్లో నిర్మాతగా సినిమాలు కంటిన్యూ చేయాలనుకోవడం లేదట. మరి బాలయ్య పూర్తిగా సినిమా నిర్మాణానికి దూరంగా ఉంటారా లేదా..? అనే విషయంపై అధికార ప్రకటన రావల్సివుంది. 

PREV
click me!

Recommended Stories

Emmanuel: కట్టే కాలే వరకు ఎంటర్‌టైన్‌ చేస్తా.. బిగ్‌ బాస్‌ మాటలకు ఇమ్మాన్యుయెల్‌ కన్నీటి పర్యంతం
Yogibabu బ్రహ్మానందం కలిసి వస్తే.. నవ్వులు సునామీ వచ్చేది ఎప్పుడంటే?