బాలయ్య @ రౌడీ పోలీస్..?

Published : Apr 28, 2019, 04:30 PM IST
బాలయ్య @ రౌడీ పోలీస్..?

సారాంశం

నందమూరి బాలకృష్ణ తన కెరీర్ లో చాలా సార్లు పోలీస్ అవతారమెత్తారు. ఆయన పోలీస్ గా నటించిన సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ ని అందుకున్నాయి. 

నందమూరి బాలకృష్ణ తన కెరీర్ లో చాలా సార్లు పోలీస్ అవతారమెత్తారు. ఆయన పోలీస్ గా నటించిన సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ ని అందుకున్నాయి. ఇప్పుడు మరోసారి బాలయ్య పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారని సమాచారం.

సి.కల్యాణ్ నిర్మాతగా దర్శకుడు కెఎస్ రవికుమార్ రూపొందించనున్న సినిమాలో బాలయ్య హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆయన పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తారని తెలుస్తోంది. ఎస్పీ రంజిత్ కుమార్ రాణా పేరుతో ఉంటుందని అంటున్నారు.

రౌడీ పోలీస్ తరహాలో ఉండే ఆయన పాత్ర నందమూరి అభిమానులను ఆకట్టుకుంటుందని అంటున్నారు. గతంలో కెఎస్ రవికుమార్, బాలయ్య కాంబోలో 'జై సింహా' సినిమా వచ్చింది. ఇప్పుడు మరోసారి వీరిద్దరూ కలిసి సినిమా చేస్తున్నారు.

వీలైనంత త్వరగా సినిమా పూర్తి చేయాలని చూస్తున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే షూటింగ్ వేగవంతం చేయనున్నారు. కమర్షియల్ అంశాలకు లోటు లేకుండా ఈ సినిమాను రూపొందించనున్నారు. ఈ సినిమాలో జగపతిబాబు విలన్ గా కనిపిస్తారని అంటున్నారు. 

PREV
click me!

Recommended Stories

మన శంకర వరప్రసాద్ గారు నిజంగానే రీజినల్ ఇండస్ట్రీ హిట్ సినిమానా ? టాప్ 3 మూవీస్ ఇవే
Border 2 collections: బార్డర్ 2 ఫస్ట్ డే వసూళ్లు, `ధురంధర్‌` రికార్డు బ్రేక్‌.. సన్నీ డియోల్ మూవీ కలెక్షన్ల సునామీ