`ఇద్దరు క్రాక్‌లు కలిస్తే`.. తనపైనే సెటైర్లు వేసుకున్న బాలయ్య.. `వీరసింహారెడ్డి` ఒక విస్పోటనం అంటూ రచ్చ

Published : Jan 06, 2023, 10:40 PM ISTUpdated : Jan 06, 2023, 10:44 PM IST
`ఇద్దరు క్రాక్‌లు కలిస్తే`.. తనపైనే సెటైర్లు వేసుకున్న బాలయ్య.. `వీరసింహారెడ్డి` ఒక విస్పోటనం అంటూ రచ్చ

సారాంశం

నందమూరి బాలకృష్ణ తనపై తానే పెద్ద సెటైర్‌ వేసుకున్నారు. `వీరసింహారెడ్డి` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో దర్శకుడు గోపీచంద్‌ మలినేనితో పోల్చుతూ షాకింగ్‌ కామెంట్‌ చేశారు.

బాలయ్య తనపై తానే సెటైర్లు వేసుకున్నారు. తనకొ క్రాక్‌ అని షాకింగ్‌ కామెంట్‌ చేశారు. `వీరసింహారెడ్డి` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో దర్శకుడు గోపీచంద్‌ మలినేని గురించి చెబుతూ, `ఇద్దరు క్రాక్‌లు కలిస్తే ఎలా ఉంటుంది` అని వెల్లడించారు. గోపీచంద్‌ చివరగా `క్రాక్‌` మూవీతో హిట్‌ కొట్టిన విషయం తెలిసిందే. ఆ విషయాన్ని గుర్తు చేస్తూ తామిద్దరం క్రాక్‌ అని, మేం ఇద్దరి కలిసి చేస్తే సినిమా ఎలా ఉంటుందో `వీరసింహారెడ్డి`లో చూస్తారని తెలిపారు. 

ఈ సందర్భంగా `వీరసింహారెడ్డి` సినిమాపై తన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. సినిమా హిట్‌ అవుతుందనే నమ్మకం ఉందని చెప్పను, అని ఆడి తీరుతుందన్నారు. అన్ని కలిస్తే అదొక విస్పోటనం అంటుంటారు. `వీరసింహారెడ్డి` ఓ విస్పోటనం లాంటి సినిమా అన్నారు. మరోవైపు సంగీత దర్శకుడు థమన్‌ని ఆకాశానికి ఎత్తేశాడు, `అఖండ` సినిమాలో ఆయన బీజీఎంకి థియేటర్ బాక్సులు పగిలిపోయాయి. అమెరికాలో సౌండ్‌ పెంచితే అక్కడ బాక్సులన్నీ పగిలిపోయాయి. దీంతో సౌండ్‌ పెంచొద్దని, అలా చేస్తే పోలీస్‌ కేసు పెడతామని హెచ్చరించారు. కానీ ఇది దాన్ని మించి ఉంటుందన్నారు. రేపు `వీరసింహారెడ్డి`కి కూడా థియేటర్లలో సౌండ్‌ బాక్సులన్నీ బద్దలైపోతాయన్నారు బాలయ్య. 

అభిమానుల గురించి చెబుతూ, అభిమానం డబ్బుతో కొనలేమని, ప్రలోభాలకు లోను కానిది అభిమానం అని, తనకు లక్షల, కోట్లాది మంది అభిమానులుండటం మా అదృష్టం అని తెలిపారు. బాలయ్య అభిమానులంటే క్రమశిక్షణకు పెట్టింది పేరన్నారు.అద్భుతమైన సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు ధన్యవాదాలు. ఎన్ని జన్మల విడిదీయలేని అనుబంధం మనది అని అన్నారు.

శృతి హాసన్‌ పై ఈ సందర్భంగా ప్రశంసలు కురిపించారు. తమ లాంటి ఎంతో మందికి నటనలో ఆదర్శంగా నిలిచే కమల్‌ కూతురు అని, ఆమెలో కామెడీ టైమింగ్‌, నటన అద్భుతం అని, కమల్‌ డీఎన్‌ఏ, తమ డీఎన్‌ఏ మిక్స్ చేసినట్టుగా ఉంటుందని తెలిపారు. అలాగే నిర్మాతలు, రైటర్‌ బుర్ర సాయిమాధవ్‌, దునియా విజయ్‌, కీలక పాత్రలో నటించి రోసీ గురించి ప్రత్యేకంగా చెప్పారు బాలయ్య. తనదైన స్టయిల్‌లో స్పీచ్‌తో అదరగొట్టారు. అభిమానులను క్షేమంగా ఇంటికి వెళ్లాలని ఆయన కోరుకున్నారు.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Rithu Remuneration బిగ్ బాస్ విన్నర్ రేంజ్ లో పారితోషికం, రీతూ చౌదరి ఎలిమినేషన్ కు కారణాలు ఇవే ?
30 ఏళ్ళు మేకప్ మ్యాన్ గా పని చేసిన వ్యక్తితో అనుష్క సినిమా, గోవాకి పిలిచి మరీ వార్నింగ్ ఇచ్చిన అగ్ర హీరో