బాలయ్యని ఇద్దరూ కలిసి కన్ఫూజన్ లో పడేసారు

Published : Jun 07, 2019, 08:09 AM IST
బాలయ్యని ఇద్దరూ కలిసి  కన్ఫూజన్ లో పడేసారు

సారాంశం

వరసగా వచ్చిన బయోపిక్ చిత్రాలతో దెబ్బ తిన్న బాలయ్య...తిరిగి ఫామ్ లోకి రావటానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ప్రయోగాత్మక చిత్రాలు కాకుండా తనలోని మాస్ యాంగిల్ ని ఎలివేట్ చేసే సినిమా చేయాలని ఉత్సాహపడుతున్నాడు. అలాగని మరీ ఓల్డ్ టైప్ కథలని ఆయన ఇష్టపడటం లేదు. కానీ ఆయన దగ్గరకు వచ్చేవాళ్లు సమరసింహా రెడ్డి టైప్ కథలనే మార్చి మార్చి చెప్తున్నారు. 

వరసగా వచ్చిన బయోపిక్ చిత్రాలతో దెబ్బ తిన్న బాలయ్య...తిరిగి ఫామ్ లోకి రావటానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ప్రయోగాత్మక చిత్రాలు కాకుండా తనలోని మాస్ యాంగిల్ ని ఎలివేట్ చేసే సినిమా చేయాలని ఉత్సాహపడుతున్నాడు. అలాగని మరీ ఓల్డ్ టైప్ కథలని ఆయన ఇష్టపడటం లేదు. కానీ ఆయన దగ్గరకు వచ్చేవాళ్లు సమరసింహా రెడ్డి టైప్ కథలనే మార్చి మార్చి చెప్తున్నారు. ఈ నేపధ్యంలో కె.ఎస్ రవికుమార్ తోనూ, బోయపాటి శ్రీను తోనూ ఓ సినిమా చెయ్యాలని అనుకున్నారు. అయితే ఆ నిర్ణయమే ఆయన్ని కన్ఫూజన్ లో పడేసిందంటున్నారు.

తను అనుకున్న దర్శకులు ఇద్దరూ సరైన కథతో తనను మెప్పించకపోవటమే కారణం అంటున్నారు. కెఎస్ రవికుమార్ తో ఇమ్మీడియట్ గా ఓ సినిమా చేద్దాం అనుకుంటే ఆయన కథలో కొన్ని ఎలిమెంట్స్ ఇబ్బంది పెట్టేలా ఉన్నాయని మార్చమని చెప్తే..మార్చిన చెప్పిన కథలో కిక్ పోయిందిట. బోయపాటి కథ వింటే తన పాత సినిమాల రీమిక్స్ లా ఉందిట. వినయవిధేయరామ తర్వాత బోయపాటితో చేసే సినిమా విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే నవ్వులు పాలు అవుతానని భయపడుతున్నారట. అప్పటికీ దిల్ రాజుతో బోయపాటి కలిసి మరీ ప్రపోజల్ పెట్టారట. 

దిల్ రాజుకు బాలకృష్ణతో సినిమా తీయాలని ఎప్పటినుంచో ఆలోచన ఉందిట. ఆయన స్థాయికి తగ్గ రేంజ్‌లోనే తప్పకుండా ఓ సినిమా నిర్మించాలనే పట్టుదలతో ఉన్నాడట దిల్ రాజు. త్వరలోనే తను దగ్గరుండి బోయపాటితో మార్పులు చేయించి బాలకృష్ణకు కథ వినిపించి ఆయన్నుంచి గ్రీన్‌సిగ్నల్ అందుకుంటే స్క్రిప్ట్ మీద పూర్తి స్థాయిలో వర్క్ చేయాలని దిల్ రాజు భావిస్తున్నాడట. ఈ నేపధ్యంలో బాలయ్య- దిల్ రాజు కాంబో నిజంగానే సెట్ అవుతుందో లేదో చూడాలి.

PREV
click me!

Recommended Stories

Chiranjeevi: చిరంజీవితో నటించి సెలెబ్రిటీలని పెళ్లి చేసుకున్న హీరోయిన్లు వీళ్ళే..సుహాసిని నుంచి జ్యోతిక వరకు
Akhanda 2: అఖండ 2 సంక్రాంతికి వస్తే ఎవరికి నష్టం ? ఒకవైపు ప్రభాస్, మరోవైపు చిరంజీవి.. జరిగేది ఇదే