పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో బాలకృష్ణ ఓ సినిమా చేయనున్నాడని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే పూరి - బాలయ్యకు కథని కూడా వినిపించాడట. ఈ కథ ఆయనకు బాగా నచ్చిందట. త్వరలోనే చిత్రానికి సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉందని కూడా టాలీవుడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి.
చారిత్రక చిత్రాలు, జానపద చిత్రాలు, ఫాంటసీ చిత్రాలు చేయాలంటే బాలయ్య తర్వాతే ఎవరైనా. ఈ జనరేషన్ లో బాలయ్యలా ఆ తరహా పాత్రలను ఆహార్యం,వాచకంతో మెప్పించేవాళ్లు లేరంటే అతిశయోక్తి కాదు. ఆదిత్యా 369,భైరవ ద్వీపం వంటి సినిమాలు చేయాలంటే ఆయన తప్ప వేరేవారు లేరు. బాలయ్యకు కూడా అదే తరహా సినిమాలంటే ఇష్టం. ఎంత కష్టానికైనా వెనకాడరు. అందుకేనేమో బాలయ్య ఇప్పుడు ఓ ఫాంటసి సినిమాని ఓకే చేసారట. అందులో ఆయన ఓ రాజుగా కనిపించబోతున్నారట. ఈ సినిమాకు డైరక్టర్ మరెవరో కాదు పూరి జగన్నాథ్ అని తెలుస్తోంది.
నందమూరి బాలకృష్ణ డైరక్టర్స్ హీరో అని పేరు. డైరక్టర్ ఏం చెబితే అది తూచ తప్పకుండా పాటించే హీరో. అందుకే బాలకృష్ణ అంటే చాలామంది దర్శకులకు ఎంతో ఇష్టం. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో బాలకృష్ణ మరోసారి సినిమా చేయనున్నాడని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే పూరి - బాలయ్యకు కథని కూడా వినిపించాడట. ఈ కథ ఆయనకు బాగా నచ్చిందట. త్వరలోనే చిత్రానికి సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉందని కూడా టాలీవుడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి.
ఆ స్టోరీ లైన్ ఏంటంటే హిస్టరీలో పాపులరైన ఓ రాజు.. కాలచక్రంలో పొరపాటున ఈ భూమి మీదకు వస్తే.. అతను తన రాజరికాన్ని చూపించే క్రమంలో ఎన్ని ఇబ్బందులు పడ్డాడు, ఇక్కడ పరిస్దితులు చూసి ఎంత ఆశ్చర్యపోయాడు అనేది స్టోరీ లైన్ అట. సినిమాలో వ్యంగ్యం ప్రధానంగా ఉన్నా.. ఫుల్ యాక్షన్ తోనే సినిమా నడుస్తోందని తెలుస్తోంది.
ప్రస్తుతం పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండతో కలిసి ‘ఫైటర్’ చిత్రం తెరకెక్కిస్తున్నారు. ఇక బాలకృష్ణ - బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఆ సినిమాకి సంబంధించి ఇప్పటికే బీబీ3 ఫస్ట్ రోర్ పేరిట ఓ వీడియో సైతం విడుదలై ఆకట్టుకుంటో్ంది. త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ తిరిగి ప్రారంభం కానుంది. ‘ఫైటర్’ తరువాత పూరి - బాలకృష్ణతో సినిమా మొదలుపెట్టానున్నాడట.
గతంలో పూరి దర్శకత్వంలో వచ్చిన ‘పైసా వసూల్’ సినిమాలో బాలయ్య కొత్తగా కనిపించడానే టాక్ వినిపించింది. ఆ సినిమా ఫలితం ఎలా ఉన్నా.. ఆ సినిమాలో బాలయ్యను చాల కొత్తగా చూపించాడు పూరి. అందుకే పూరితో మరో సినిమా చేయడానికి తానూ ఎప్పుడూ రెడీనే అని ఆ మధ్య బాలయ్య కూడా చెప్పుకొచ్చాడు. మొత్తానికి వచ్చే ఏడాదిలో వీరి సినిమా మొదలయ్యే అవకాశం ఉంది.