అన్న హరికృష్ణని గుర్తు చేసుకుంటూ బాలకృష్ణ ఎమోషనల్‌ పోస్ట్

Published : Aug 29, 2022, 02:39 PM IST
అన్న హరికృష్ణని గుర్తు చేసుకుంటూ బాలకృష్ణ ఎమోషనల్‌ పోస్ట్

సారాంశం

నందమూరి హరికృష్ణకి.. తమ్ముడు, హీరో బాలకృష్ణ నివాళ్లు అర్పించారు. హరికృష్ణ వర్థంతి సందర్భంగా ఆయన్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్‌ పోస్ట్ పెట్టారు బాలయ్య. 

నటుడు, మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణకి ఆయన వర్థంతి సందర్భంగా తమ్ముడు, హీరో నందమూరి బాలకృష్ణ నివాళ్లు అర్పించారు. నాలుగేళ్ల క్రితం హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో కన్నుమూసిన విషయం తెలిసిందే. నేడు(ఆగస్ట్ 29) వర్థంతి సందర్భాన్ని పురస్కరించుకుని బాలయ్య అన్నయ్యని గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు ఆయన సోషల్‌ మీడియా ద్వారా ఎమోషనల్‌ పోస్ట్ పెట్టారు. 

ఇందులో బాలకృష్ణ చెబుతూ, `మా అన్న నందమూరి హరికృష్ణ గారి వర్థంతి సందర్భంగా ఆ మహానుభావుడికి నా ఘన నివాళ్లు. తన కోసం కంటే నాన్నగారి ఆశయాల కోసం ఎంతో కష్టపడ్డారు. నాన్నగారి కోసం సైనికుడిలా పనిచేసిన చైతన్య రథసారధి. తెలుగు వాడి కోసం పార్లమెంట్‌లో గర్జించిన నిజమైన తెలుగువాడు. ఈ రోజు ఆయన మా మధ్య లేకపోయినా ఆయన జ్ఞాపకాలు ఎప్పుడు మాతోనే ఉంటాయి. నువ్వు ఎప్పుడూ మాతోనే ఉన్నావు, మాలోనే ఉన్నావు హరన్న. నందమూరి హరికృష్ణ అమర్‌ రహే` అంటూ బాలయ్య భావోద్వేగ పోస్ట్ ని పంచుకున్నారు. 

ఈ సందర్భంగా అరుదైన ఫోటోలను పంచుకున్నారు బాలకృష్ణ. ఎన్టీఆర్‌ రాజకీయ ప్రచారంలో చైతన్య రథ సారధిగా ఉన్నప్పటి హరికృష్ణ ఫోటోలను షేర్‌ చేశారు. అవి ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. హరికృష్ణ 2018 ఆగస్ట్ 29 నల్గొండ హైవేపై రోడ్డు ప్రమాదంలో కన్నుమూసిన విషయం తెలిసిందే. తన స్నేహితుడి ఇంట్లో ఫంక్షన్‌ నిమిత్తం ఆయన తనే స్వయంగా కారు నడుపుతూ వెళ్తున్నారు. ఈ క్రమంలో కారు అదుపుతప్పి డివైడర్‌ని ఢీ కొట్టడంతో తీవ్ర గాయాలపాలైన హరికృష్ణ ఆసుపత్రికి తరలించే క్రమంలోనే తుదిశ్వాస విడిచారు. అంతకు నాలుగేండ్ల ముందే అదే నల్గొండ హైవేపై పెద్ద కుమారుడు జానకీ రామ్‌ కూడా రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. 

హరికృష్ణకి ముగ్గురు కుమారులు జానకీరామ్‌, కళ్యాణ్‌ రామ్‌, ఎన్టీఆర్‌. జానకీరామ్‌ నిర్మాతగా రాణించారు. కళ్యాణ్‌ రామ్‌ హీరోగా, ఎన్టీఆర్‌ ఆర్ట్స్ బ్యానర్‌పై సినిమాలు నిర్మిస్తున్నారు. ఇక ఎన్టీఆర్‌ ఇప్పుడు పాన్‌ ఇండియా హీరోగా రాణిస్తున్న విషయం తెలిసిందే. హరికృష్ణ రాజ్యసభ ఎంపీగా పనిచేశారు. ఎన్టీఆర్‌ వారసత్వాన్ని పునికి పుచ్చుకుని అటు రాజకీయాల్లో, ఇటు సినిమా రంగంలోనూ రాణించారు. ఆయన హీరోగా పలు బ్లాక్‌ బస్టర్స్ లో భాగమయ్యారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Sara Arjun: ధురంధర్ స్టార్ సారా అర్జున్ రూ.12 కోట్ల లగ్జరీ ఫ్లాట్.. వైరల్ ఫోటోలు
Top 10 Movies 2025: పవన్, వెంకటేష్, రాంచరణ్ లలో బాక్సాఫీస్ వద్ద ఎవరి సత్తా ఎంత ? 2025లో టాప్ 10 మూవీస్ ఇవే