బాలకృష్ణ కొత్త సినిమా లుక్‌ లీక్‌.. యంగ్‌ లుక్‌లో స్టయిల్‌ కా బాప్‌ అనిపిస్తున్నాడుగా!

Published : Jan 05, 2024, 10:25 PM IST
బాలకృష్ణ కొత్త సినిమా లుక్‌ లీక్‌.. యంగ్‌ లుక్‌లో స్టయిల్‌ కా బాప్‌ అనిపిస్తున్నాడుగా!

సారాంశం

బాలకృష్ణ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. `ఎన్బీకే109` పేరుతో రూపొందుతున్న ఈ మూవీ నుంచి బాలయ్య లుక్‌ లీక్‌ అయ్యింది. ప్రస్తుతం అది వైరల్‌ అవుతుంది.

బాలకృష్ణ హ్యాట్రిక్‌ హిట్‌ అందుకుని సక్సెస్‌ జోరులో ఉన్నారు. `అఖండ`, `వీరసింహారెడ్డి`, `భగవంత్‌ కేసరి` చిత్రాలతో వరుసగా విజయాలు అందుకున్నారు. దీంతో బాలయ్య ఊపు మామూలుగా లేదు. ఆ జోరులోనే ఆయన ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఎన్బీకే 109 పేరుతో ఈ మూవీ తెరకెక్కుతుంది. `వాల్తేర్‌ వీరయ్య` తర్వాత బాబీ చేస్తున్న సినిమా కావడం, హ్యాట్రిక్‌ హిట్‌లో ఉన్న బాలయ్య చేస్తున్న సినిమా కావడంతో దీనిపై ప్రారంభం నుంచి అంచనాలున్నాయి. 

ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది. దర్శకుడు బాబీ చాలా సైలెంట్‌గా మూవీని తీస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ జరుగుతుందనే విషయం కూడా బయటకు రాకుండా మ్యానేజ్‌ చేయడం విశేషం. ఫాస్ట్ గా సినిమాని కంప్లీట్‌ చేయాలని భావిస్తున్నారు. బాలయ్య గానీ, దర్శకుడుగానీ, ఇతర యూనిట్‌గానీ ఈ మూవీ గురించి ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు. అంతా సస్పెన్స్ తో సాగుతుంది. 

లేటెస్ట్ గా అందుతున్న సమాచారం మేరకు ఈ మూవీ ఆల్‌ రెడీ సగానికిపైగా షూటింగ్‌ పూర్తయ్యిందట. అంతేకాదు ఈ మూవీ రిలీజ్‌ డేట్ విషయంలోనూ ఓ అప్‌డేట్‌ వినిపిస్తుంది. దీన్ని సమ్మర్‌లో ఆడియెన్స్ ముందుకు తీసుకురావాలనుకుంటున్నారట. మొదట దసరాకి రిలీజ్‌ చేయాలనుకున్నారు. కానీ అంతకంటే ముందే షూటింగ్‌ పూర్తవుతున్న నేపథ్యంలో రిలీజ్‌ని ముందుగానే చేయాలనుకుంటున్నారట. ఈ నేపథ్యంలో సమ్మర్‌లో అంటే మేలో రిలీజ్‌కి ప్లాన్‌ చేస్తున్నట్టు తెలుస్తుంది. 

ఇదిలా ఉంటే ఈ చిత్రంలో హీరోయిన్‌గా పలువురు పేర్లు వినిపిస్తున్నాయి. త్రిష పేరు తెరపైకి వచ్చింది. కానీ ఇప్పుడు ప్రియమణి పేరు వినిపిస్తుంది. ప్రియమణిని ఫైనల్‌ చేసినట్టు సమాచారం. ఇక ఈ మూవీని ఫ్యామిలీ బ్యాక్‌ డ్రాప్‌లో సాగే ఎమోషనల్‌ డ్రామా అని తెలుస్తుంది. డ్రామా, ఎమోషన్స్ కి పెద్ద పీఠ వేస్తున్నారట. అలాగే యాక్షన్‌ సీన్లకి కూడా కొదవలేదని సమాచారం.ఇప్పటి వరకు ఈ సినిమాలో బాలయ్య ఎలా కనిపిస్తాడనేది బయటకు రాలేదు. టైటిల్‌, ఫస్ట్ లుక్‌ రాలేదు. 

 ఇదిలా ఉంటే ఈ మూవీ నుంచి బాలయ్య లుక్‌ లీక్‌ అయ్యింది. తాజాగా షూటింగ్‌ సెట్‌ నుంచి బాలయ్య లుక్‌ బయటకు వచ్చింది. ఇందులో యంగ్‌ గా కనిపిస్తున్నాడు బాలయ్య. అంతేకాదు స్టయిలీష్‌గా కనిపిస్తున్నాడు. యంగ్‌ అండ్‌ స్టయిలీష్‌ లుక్‌లో అదరగొడుతున్నారు. వైట్‌ షర్ట్, బ్లాక్‌ ప్యాంట్ ధరించాడు బాలయ్య. స్టయిలీష్ గ్లాస్‌ షర్ట్ కి వేలాడేశాడు. తలపై టోపీ పెట్టాడు. ఫ్యాన్స్ ని ఆకట్టుకునేలా ఆయన లుక్‌ ఉండటం విశేషం. అయితే ఇందులో బాలయ్య చాలా యంగ్‌ గా కనిపిస్తుండటం విశేషం. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Balakrishna: బాలకృష్ణకి నచ్చిన జూ. ఎన్టీఆర్ 2 సినిమాలు ఏంటో తెలుసా ? అభిమానులకు పూనకాలు తెప్పించిన మాట అదే
Chiranjeevi : దాసరి స్థానం మెగాస్టార్ దే, ఇండస్ట్రీ పెద్ద ఎవరో తేల్చేసిన మా మాజీ అధ్యక్షుడు