సీఎంకు చెక్ ఇచ్చిన బాలకృష్ణ!

Published : Oct 21, 2018, 03:23 PM IST
సీఎంకు చెక్ ఇచ్చిన బాలకృష్ణ!

సారాంశం

స్టార్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకొని హిందూపురం ఎమ్మెల్యేగా కొనసాగుతున్న నందమూరి బాలకృష్ణ మరోసారి తన మంచి మనసును చాటుకున్నాడు. తితిలీ బాధితుల కోసం ఆయన 25 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా టాలీవుడ్ ప్రముఖులు విరాళాలు అందిస్తున్నారు. 

యువ హీరోలు సీనియర్ హీరోలు అని తేడా లేకుండా అందరూ వారికీ తోచినంత సహాయాన్ని అందిస్తున్నారు. ఇక నందమూరి బాలకృష్ణ నేడు 25 లక్షల రూపాయల చెక్ ను డైరెక్ట్ గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి అందించారు. ఈ సందర్బంగా వారు దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సీఎం రిలీఫ్ ఫండ్ కు చాలా మంది నటీనటులు విరాళాలు అందిస్తున్నారు. 

అందుకు సీఎం చంద్రబాబు సహాయపడిన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు. తితిలి తుఫాను ధాటికి ఎక్కువగా శ్రీకాకుళం వాసులు నష్టపోయిన సంగతి తెలిసిందే. వారిని ఆదుకోవడానికి అందరూ ముందుకు రావాలని ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చారు.   

PREV
click me!

Recommended Stories

NTR and Vijay: ఆగిపోయిన ఎన్టీఆర్‌, విజయ్‌ దేవరకొండ చిత్రాలు.. బెడిసికొడుతున్న రాజమౌళి స్ట్రాటజీ
Ram Charan: కెరీర్ లో 2 సార్లు కాస్ట్లీ మిస్టేక్స్ చేసిన రాంచరణ్.. చిరంజీవి కూడా ఏం చేయలేకపోయారా ?