UnstoppablewithNBK2: దసరాకి అన్‌స్టాపబుల్‌తో బాలయ్య సర్‌ప్రైజ్‌.. గ్రాండ్‌గా ట్రైలర్‌ ఈవెంట్‌

Published : Oct 01, 2022, 04:02 PM IST
UnstoppablewithNBK2: దసరాకి అన్‌స్టాపబుల్‌తో బాలయ్య సర్‌ప్రైజ్‌.. గ్రాండ్‌గా ట్రైలర్‌ ఈవెంట్‌

సారాంశం

బాలయ్య హోస్ట్ గా ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో ఈ షోని రన్‌ చేయబోతుంది `ఆహా`. రెండో సీజన్‌ ట్రైలర్‌ ఈవెంట్‌ని ప్లాన్‌ చేశారు. దసరాకి ఒక్క రోజు ముందుగానే ట్రీట్‌ ఇవ్వబోతున్నారు.

బాలకృష్ణ(Balakrishna)లోని మరో యాంగిల్‌ని బయటకు తీసుకొచ్చిన షో `అన్‌స్టాపబుల్ వీత్‌ ఎన్బీకే`(UnstoppablewithNBK2). గతేడాది ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ `ఆహా`(Aha)లో ప్రసారమైన సెలబ్రిటీ టాక్‌ షో. ఈ షోకి విశేష ఆదరణ దక్కింది. బాలయ్య ఫస్ట్ టైమ్‌ హోస్ట్ గా చేయడంతో అంతా ఆసక్తి చూపించారు. ఆయన కూడా ఫన్నీగా వ్యవహరించడంతో ఆద్యంతం ఆకట్టుకుంది. తాజాగా రెండో సీజన్‌ ప్రారంభించబోతున్నారు. త్వరలోనే ఈ టాస్‌ షో సెకండ్‌ సీజన్‌ ప్రారంభం కానుంది. ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది. 

బాలయ్య హోస్ట్ గా ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో ఈ షోని రన్‌ చేయబోతుంది `ఆహా`. రెండో సీజన్‌ ట్రైలర్‌ ఈవెంట్‌ని ప్లాన్‌ చేశారు. దసరా కానుకగా ఈ నెల 4న `అన్‌స్టాపబుల్‌విత్ఎన్బీకే2` ట్రైలర్‌ని విడుదల చేయబోతున్నట్టు నిర్వహకులు తాజాగా ప్రకటించారు. గ్రాండ్‌ ఈవెంట్‌గా దీన్ని ప్లాన్‌ చేయడం విశేషం. అక్టోబర్‌ 4న విజయవాడలో ఈ ట్రైలర్‌ ఈవెంట్‌ని నిర్వహిస్తున్నారు. బాలయ్య అభిమానుల సమక్షంలో ఈ షో ట్రైలర్‌ని విడుదల చేయబోతుండటం విశేషం. 

దీనిపై ఆహా టీమ్‌ చెబుతూ, `అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే` అంటూ `ఆహా` ద్వారా ఓటీటీ ఎంట్రీ ఇచ్చారు బాలకృష్ణ. సీజన్ 2 కోసం ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎందురుచూస్తున్నారు. 100 % లోకల్ ఎంటర్టైన్మెంట్ తో దూసుకుపోతోన్న ఆహా తెలుగు ఈసారి కూడా ఎవరూ చూడని విధంగా బాలయ్య బాబు ని అభిమానులకి చూపించబోతుంది. ఐఏండిబి లో టాక్ షో అన్నింటిలోనూ అన్ స్టాపబులే నెంబర్ వన్ ఉండేలా నిలబెట్టారు బాలకృష్ణ.  మొదటి సీజన్ ను ఘనవిజయంగా పూర్తి చేసిన ఆహా. ఇప్పుడు సీజన్ 2 తో రావడానికి రెడీ అవుతోంది. అందు కోసం మరోసారి స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తో జతకటింది. 

 `జాంబిరెడ్డి`, `కల్కి`, `అ` చిత్రాలతో తనకంటూ ఓ గుర్తింపుని తెచ్చుకున్నారు ప్రశాంత్‌ వర్మ. 2011 లో `దీనమ్మ జీవితం` అనే షార్ట్ ఫిలిం తో ఆయన ప్రయాణం మొదలుపెట్టారు. అలా మొదలుబెట్టిన తన ప్రయాణం `అన్ స్టాపబుల్` సీజన్ 1 వరకు సాగింది. నందమూరి బాలకృష్ణను ఇలా కూడా చూడగలమా అనేంత గొప్పగా చూపించారు. ఇప్పుడు మరోసారి ఎవరూ ఊహించని విధంగా నందమూరి బాలకృష్ణ ను చూపించబోతున్నారు ప్రశాంత్ వర్మ. ఈ షో ట్రైలర్ ని అక్టోబర్ 4 విజయవాడ లో అభిమానుల ముందు ప్రదర్శించబోతున్నాం` అని తెలిపింది. 

దీనిపై దర్శకుడు ప్రశాంత్‌ వర్మ మాట్లాడుతూ, `అన్‌స్టాపబుల్‌` సీజన్ 1 ప్రోమో షూట్ తర్వాత బాలకృష్ణ గారితో మరోసారి తప్పకుండా పనిచేయాలని చాలా గట్టిగా అనుకున్నా. అందుకే ఈసారి కూడా అవకాశం నాకే వచ్చింది. `ఆహ` టీం సీజన్ 2 ట్రైలర్ కోసం స్టోరీ రాయాలి అనగానే, నేను వెంటనే ఒప్పుకున్నాను. బాలయ్యతో పని చేయడమంటేనే ఒక అద్భుతం. ఈ స్టోరీ అందరికి నచ్చే విధంగా తీర్చిదిద్దుతాను. ఒక విధంగా ఇది నా ముద్దుబిడ్డ అని చెప్పొచ్చు. అక్టోబర్ 4 న మీరు చూసే ట్రైలర్ అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నా` అని చెప్పారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

స్టార్ హీరో డెబ్యూ టైంకి ఇంకా పుట్టని హీరోయిన్లు..ఇప్పుడు వాళ్ళతోనే రొమాన్స్, ఏజ్ గ్యాప్ తెలిస్తే షాకే!
Sudheer-Vishnu Priya: సుడిగాలి సుధీర్‌కి విష్ణుప్రియ మ్యారేజ్‌ ప్రపోజల్‌, స్టార్‌ కమెడియన్‌ రియాక్షన్‌ ఇదే