యూఎస్ లో పర్యటించనున్న గౌతమిపుత్ర శాతకర్ణి టీమ్

Published : Jan 17, 2017, 11:13 AM ISTUpdated : Mar 26, 2018, 12:01 AM IST
యూఎస్ లో పర్యటించనున్న గౌతమిపుత్ర శాతకర్ణి టీమ్

సారాంశం

ఓవర్సీస్ లో విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న గౌతమిపుత్ర శాతకర్ణి ఓవర్సీస్స లో రికార్డు కలెక్షన్లు సాధిస్తున్న బాలకృష్ణ వందో చిత్రం ప్రేక్షకులకు ధన్యవాాదలు తెలిపేందుకు యూఎస్ వెళ్లనున్న గౌతమిపుత్ర శాతకర్ణి టీమ్

గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా విశేష ప్రేక్షకాదరణ పొందుతూ మంచి కలెక్షన్లు సాధిస్తూ విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఓవర్సీస్ లోనూ మంచి కలెక్షన్సే రాబడుతోంది. దీంతో ఓవర్సీస్ ప్రేక్షకులను నేరుగా కలిసి ధన్యవాదాలు తెలపాలని భావిస్తున్నారు బాలకృష్ణ అండ్ టీం.

 

బాల‌కృష్ణ న‌టించిన 100వ చిత్రం గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి. సంక్రాంతి కానుక‌గా రిలీజైన గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి చిత్రం స‌క్సెస్ ఫుల్ గా ర‌న్ అవుతుంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవ‌ర్ సీస్ లో సైతం రికార్డ్ స్ధాయి క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేస్తోంది. విభిన్న క‌థా చిత్రాల ద‌ర్శ‌కుడు క్రిష్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌డం, బాలకృష్ణకు ఇది వందో చిత్రం కావడంతో... గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి చిత్రం ఓవ‌ర్ సీస్ లో 1 మిలియ‌న్ డాల‌ర్ వ‌సూలు చేసి రికార్డ్ సృష్టించింది.

 

ఈ సంద‌ర్భంగా ఓవ‌ర్ సీస్ లో ప్రేక్ష‌కుల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌చేసేందుకు గాను స‌క్సెస్ టూర్ ప్లాన్ చేస్తున్నారు. ఈ విష‌యం తెలుసుకుని ఓవ‌ర్ సీస్ లో ఫ్యాన్స్ బాల‌య్య‌కు ఘ‌న స్వాగ‌తం చెప్పేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక టూర్ విష‌యానికి వ‌స్తే...గురువారం సాయంత్రం బే ఏరియాలో, శుక్ర‌వారం డ‌ల్లాస్, శ‌నివారం డెట్రాయిట్, ఆదివారం న్యూజెర్సీ, ఫిల‌డెల్ఫియాలోని ధియేట‌ర్ల‌ను బాల‌య్య సంద‌ర్శించ‌నున్నారు.

PREV
click me!

Recommended Stories

Brahmamudi Serial Today Episode: పాపం ఇందును నానా హింసలు పెట్టిన రేఖ, కాళ్లపై పడ్డ అపర్ణ
Rajini Kamal Movie: రజినీకాంత్ తో సినిమా ఎప్పుడు? కమల్ హాసన్ ఓపెన్‌ కామెంట్స్..