దిల్ రాజుని వెనక్కి తన్నేసిన బాలయ్య!

By Udayavani DhuliFirst Published Jan 4, 2019, 10:37 AM IST
Highlights

నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు అనీల్ రావిపూడి సినిమా చేయాలనుకున్నాడు. బాలయ్య 'శాతకర్ణి' సినిమాకి ముందే చర్చలు కూడా జరిగాయి.

నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు అనీల్ రావిపూడి సినిమా చేయాలనుకున్నాడు. బాలయ్య 'శాతకర్ణి' సినిమాకి ముందే చర్చలు కూడా జరిగాయి. అనీల్ చెప్పిన కథ కూడా బాలయ్యకి నచ్చింది కానీ ప్రాజెక్ట్ అప్పుడు సెట్ కాలేదు.

ఇప్పుడు మళ్లీ బాలకృష్ణ నుండి అనీల్ రావిపూడికి కబురు వెళ్లిందని తెలుస్తోంది. దీంతో 'ఎఫ్2' సినిమా విడుదలైన తరువాత బాలయ్యకి చెప్పిన కథపై కసరత్తులు చేయనున్నారు. నిజానికి ఈ ప్రాజెక్ట్ దిల్ రాజు బ్యానర్ లో చేయాలని అనుకున్నారు.

అనీల్ రావిపూడితో దిల్ రాజు మూడు సినిమాల కాంట్రాక్ట్ చేసుకున్నాడు. 'ఎఫ్2' చిత్రంతో ఆ కాంట్రాక్ట్ పూర్తయింది. దిల్ రాజు కారణంగానే బాలయ్యని కలిసే చాన్స్ అనీల్ రావిపూడికి దక్కింది. దీంతో దిల్ రాజు బ్యానర్ లోనే సినిమా చేయాలనుకున్నాడు. కానీ బాలకృష్ణ మాత్రం దానికి అంగీకరించడం లేదని తెలుస్తోంది. ఎన్టీఆర్ బయోపిక్ కోసం స్థాపించిన ఎన్‌బికె ఫిలిమ్స్ బ్యానర్ పైనే తన తదుపరి చిత్రాలు చేయాలని బాలయ్య భావిస్తున్నాడు.

దీంతో దిల్ రాజుని వెనక్కి నెట్టేశారు. తన సొంత బ్యానర్ లోనే అనీల్ రావిపూడితో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఎన్టీఆర్ బయోపిక్ విడుదలైన తరువాత ఫిబ్రవరి నెల నుండి బోయపాటి సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నాడు బాలయ్య. 

click me!